‘370 రద్దు ‘షా’ చేసిన మూర్ఖపు ఆలోచన..ఇది ప్రమాదకర చర్య’
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్టికల్ 370ని రద్దు చేయడం ప్రజాస్వామికానికి వ్యతిరేకమని సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. 370 రద్దు అనేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన మూర్ఖపు ఆలోచన అని ఇది ప్రమాదకర చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ దుస్సాహాసమేనని సురవరం వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుపై పునరాలోచన చేయాలని.. దీన్ని సీపీఐ పూర్తిగా ఖండిస్తోందన్నారు. 370 రద్దుతో కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమైందన్నారు.
"కాశ్మీర్ ప్రత్యేక పరిస్థితుల్లో గతంలోనే భారతదేశంలో అంతర్భాగం అయ్యింది. 370 రద్దుతో కాశ్మీర్ పూర్తిస్థాయిలో విలీనం చేసినట్లు మీడియా ప్రచారం చేస్తోంది. తీవ్రవాదం ఇటీవల పెరిగింది. 370 ఆర్టికల్ 35(A) ప్రకారం అప్పట్లో ప్రజలు కొన్ని హక్కులు కోరారు. అకారణంగా జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు. 370 రద్దు జమ్మూ కాశ్మీర్ సమస్యలు పరిష్కారం చేయదు. ‘ప్రో పాకిస్తాన్’ అనుకూలంగా ఉన్న వారిని పెంచేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుంది" అని సురవరం చెప్పుకొచ్చారు.
చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...
బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణలో కూలీలకు పని దొరకడం లేదని.. మహబూబ్ నగర్ లో పని కోసం వేరే ప్రాంతాలకు పోవడం వల్ల నిన్న రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు.
నిన్న రోడ్ ప్రమాదంలో చనిపోయిన వారికి కేసీఆర్ 10లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం సక్రమంగా అమలు అయ్యేలా చూడాలన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments