మోదీ కేబినెట్‌లోకి కిషన్‌రెడ్డి.. గుడ్ న్యూస్ చెప్పిన షా

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

ఢిల్లీ: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి గెలిచి నిలిచిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి.. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు తియ్యటి శుభవార్త అందించారు. తెలంగాణ నుంచి మిమ్మల్ని మోదీ కేబినెట్‌లోకి తీసుకుంటున్నారని కిషన్ రెడ్డికి షా ఫోన్ చేసి చెప్పారు. దీంతో కిషన్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటున్నారు. కాగా.. అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఓడిన కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌పై ఘన విజయం సాధించారు. బీజేపీ మొత్తం నాలుగు స్థానాల్లో గెలవగా వీరందరిలో సీనియార్టీ ఉన్న కిషన్‌కు కేంద్రం ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్‌లోకి తీసుకుంటోంది. కాగా గురువారం ఉదయం మోదీ-అమిత్ షా కలిసి కేంద్ర కేబినెట్‌పై కసరత్తు చేశారు.

ఇదిలా ఉంటే.. ఇవాళ 61 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా, బెంగాల్‌, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ చీఫ్‌గా అమిత్ షా కొనసాగుతానని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మోదీ కేబినెట్‌-2లో యువతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఎంపీల్లో ఆరుగురికి ఒకరు చొప్పున కేబినెట్‌లో అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు పాతవారిలో కొంతమందిని పార్టీకి పరిమితం చేసే అవకాశం ఉంది. రాజ్‌నాథ్‌, పీయూష్ గోయల్‌, సురేష్‌ ప్రభు, గడ్కరీ, అనుప్రియ, రవిశంకర్‌, నిర్మల, సదానందగౌడ, స్మృతికి పదవులు దాదాపు ఖరారైంది.

More News

'వైఎస్ జగన్ అనే నేను...' దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా!

‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనే నేను..’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు త‌గ్గ‌ట్లే

ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `సాహో`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ఈ సినిమా రూపొంద‌డ‌మే అంచ‌నాల‌కు కార‌ణం కాదు.

వెబ్ సిరీస్‌పై ఫిదా అయిన ఆదాశ‌ర్మ‌

`హార్ట్ ఎటాక్‌`తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన అమ్మ‌డు ఆదాశ‌ర్మ‌. ఈ సొగ‌స‌రి అందచందాల‌న్నీ ఉన్న అదృష్టం లేదేమో.

హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మ‌రో బాలీవుడ్ భామ‌

బాలీవుడ్ సొగ‌స‌రులు ఐశ్వ‌ర్యారాయ్‌, ప్రియాంక‌చోప్రా, దీపికా ప‌దుకొనె హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి మెప్పించారు.

ప్రధానిగా మోదీ ప్రమాణం.. కేంద్రమంత్రులు వీళ్లే!

భారతీయ జనతాపార్టీ ఎవరు సపోర్టు లేకుండా స్వతంత్రంగా పోటీచేసి ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం మోదీ మానియా.. షా చరిష్మా మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు