మోదీ కేబినెట్లోకి కిషన్‌రెడ్డి.. గుడ్ న్యూస్ చెప్పిన షా
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి గెలిచి నిలిచిన బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి.. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు తియ్యటి శుభవార్త అందించారు. తెలంగాణ నుంచి మిమ్మల్ని మోదీ కేబినెట్లోకి తీసుకుంటున్నారని కిషన్ రెడ్డికి షా ఫోన్ చేసి చెప్పారు. దీంతో కిషన్ ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటున్నారు. కాగా.. అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఓడిన కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీచేసి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్‌పై ఘన విజయం సాధించారు. బీజేపీ మొత్తం నాలుగు స్థానాల్లో గెలవగా వీరందరిలో సీనియార్టీ ఉన్న కిషన్‌కు కేంద్రం ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్లోకి తీసుకుంటోంది. కాగా గురువారం ఉదయం మోదీ-అమిత్ షా కలిసి కేంద్ర కేబినెట్‌పై కసరత్తు చేశారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ 61 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, బెంగాల్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ చీఫ్‌గా అమిత్ షా కొనసాగుతానని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మోదీ కేబినెట్-2లో యువతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఎంపీల్లో ఆరుగురికి ఒకరు చొప్పున కేబినెట్లో అవకాశం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు పాతవారిలో కొంతమందిని పార్టీకి పరిమితం చేసే అవకాశం ఉంది. రాజ్‌నాథ్, పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, గడ్కరీ, అనుప్రియ, రవిశంకర్, నిర్మల, సదానందగౌడ, స్మృతికి పదవులు దాదాపు ఖరారైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com