'కిషన్‌రెడ్డికి అమిత్ షా క్లాస్.. అసలేం జరిగింది!?
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్ రెడ్డి ఒకింత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారిపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పి దుమారం రేపారు. ఎవరు పడితే వారు మన దేశంలో ఉండేందుకు ఇదేమి ధర్మ సత్రం కాదని.. భారతీయులెవరు? చొరబాటుదారులెవరు? అనేది లెక్క త్వరలోనే తేలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఉగ్రవాద ఘటన జరిగినా హైదరాబాద్‌ను మూలాలుంటున్నాయని, ఉగ్రవాదులు హైదరాబాద్‌ను సేఫ్ జోన్‌గా చేసుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై కొందరు ముస్లిం సోదరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ... కిషన్ రెడ్డిపై కన్నెర్రజేశారు.
ఓవైసీ స్పందన..
కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని... ఆయనకు హైదరాబాద్ ఎదగడం ఇష్టం లేదని.. ఉత్తరప్రదేశ్ లో ఐసిస్ సభ్యులు ఎక్కువగా పట్టుబడ్డారని... ఆ రాష్ట్రాన్ని ఉగ్రవాదుల అడ్డాగా చెప్పగలరా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. 300 సీట్లు వచ్చినంత మాత్రాన ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా చేయాలనుకుంటున్నారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిషన్‌కు షా క్లాస్..!
కాగా.. ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారని సుమారు అరగంటకు పైగా కిషన్‌కు క్లాస్ పీకారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొంతమంది బీజేపీ నేతలు సమర్థించడం గమనార్హం. ఇది అనవసర వివాదంగా మారుతోందని.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లకూడదని ఆయన కిషన్ రెడ్డికి క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇలాంటి వివాదాలు రావడం మంచిది కాదని కేంద్రం భావిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout