అర్థరాత్రి ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా.. వైద్యులేమన్నారంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. నేడు ఆయన తిరిగి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆగస్ట్ 2న కరోనా సోకడంతో గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స అనంతరం ఆగస్ట్ 14న నెగిటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి తాజాగా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు. మూడు రోజులుగా శ్వాసకోశ సమస్యతో పాటు ఒంటి నొప్పులతో అమిత్ షా బాధ పడుతున్నారు. దీంతో ఆయన అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. కాగా.. నేటి ఉదయం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. అమిత్ షాకు మరోసారి కోవిడ్ టెస్టులు జరపగా నెగిటివ్ వచ్చినట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆసుపత్రి నుంచే ఆఫీసు వ్యవహారాలు చక్కబెడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments