వైరల్ వీడియో: అమీర్ ఖాన్ నీతులు బాగానే చెబుతాడు.. అసలు నిర్వాకం ఇదీ!
Send us your feedback to audioarticles@vaarta.com
సెలెబ్రెటీలకు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ విమర్శకులకు టార్గెట్ గా మారారు. కెమెరాల ముందు నీతులు బాగా చెప్పే అమీర్ ఖాన్ ఆచరించేది మాత్రం శూన్యం అని నెటిజన్లు ఓ వీడియో వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ లడాఖ్ లో జరుగుతోంది. వాఖా అనే గ్రామ పరిసర ప్రాంతాల్లో అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో వందలాది మంది ఆర్టిస్టులతో షూట్ చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ లాల్ సింగ్ చద్దా షూటింగ్ జరిగిన ప్రాంతం ఇదే అంటూ ఓ వీడియో వైరల్ చేశాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అమీర్ ఖాన్ పై, చిత్ర యూనిట్ పై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఆ ప్రాతం అంతా ప్లాస్టిక్ బాటిల్స్ చెల్లాచెదురుగా పడివున్నాయి. దీనితో సదరు నెటిజన్ అమీర్ ఖాన్ ని విమర్శించాడు.
'బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, లాల్ సింగ్ చద్దా చిత్ర యూనిట్ వాఖా గ్రామ ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. సత్యమేవ జయతే లాంటి షోలలో నీతులు చెప్పే అమీర్ ఖాన్ పర్యావరణం విషయంలో ఆచరించే విధానం ఇది. వందల కోట్లు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని క్లీన్ చేయించడానికి ఏం మాయ రోగం' అంటూ తీవ్ర విమర్శలు చేశాడు.
ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పట్ల చిత్ర యూనిట్ వర్షన్ మరోలా ఉంది. అది ఇప్పటి వీడియో కాదని, పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని చిత్ర యూనిట్ స్పందించినట్లు సమాచారం. అయితే అమీర్ ఖాన్ అభిమానులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. లడాఖ్ లో షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ పూర్తయ్యాక వల్లే శుభ్రం చేస్తారు అని అంటున్నారు.
ఆర్మీ నేపథ్యంలో అద్వైత్ చందన్ 'లాల్ సింగ్ చద్దా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ హీరో నాగ చైతన్య ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. చైతూకి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ.
This is the gift Bollywood star Amir Khan's upcoming movie Lal Singh Chada has left for the villagers of Wakha in Ladakh.
— Jigmat Ladakhi ???? (@nontsay) July 8, 2021
Amir Khan himself talks big about environmental cleanliness at Satyamev Jayate but this is what happens when it comes to himself. pic.twitter.com/exCE3bGHyB
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com