ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టెలివిషన్ మరియు చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా 'అంబికా' కృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
'భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా అగరుబత్తి' అనే కాప్షన్ దేనికి సంబందించినదో తెలుగు వారికి తెలియనిది కాదు. ఏడు దశాబ్దాలుగా అగరుబత్తి పరిశ్రమలో అంబికా అగ్రగామి సంస్థ గా నిలిచింది. ఏలూరు నియోజక వర్గం నుండి తెలుగు దేశం పార్టీ లో ముఖ్య రాజకీయ వేత్తగా, ఇటు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న అజాత శత్రువు అంబికా కృష్ణ. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టి వి మరియు చలచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అంబికా కృష్ణ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా జులై 10 న సాయంత్రం గౌరవ సూచకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆయన ఛాంబర్ లో కలిసి ధన్యవాదాలు తెలుపుకున్నారు అంబికా కృష్ణ మరియు తనయుడు అంబికా రామ చంద్ర రావు.
ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ " ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరుపున ఈ పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. మేము అగర బత్తి పరిశ్రమ నుంచి వచ్చిన, సినిమా పరిశ్రమ మీద వున్నా అభిమానం తో చాలా ఏళ్లుగా నిర్మాత గా, పంపిణీదారుడిగా, మరియు థియేటర్స్ యజమానిగా అభివృద్ధి చెందడానికి ఈ రంగం లో కూడా తెలుగు ప్రజలు మమ్మల్ని ఆదరించారు. సినిమా పరిశ్రమలో వున్నా అన్ని రంగాల్లో నా కున్న అనుభవాన్ని గుర్తించి, ఈ రోజు నాకు అనితర బాధ్యతను అప్పగించిన ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. ఆంధ్ర ప్రదేశ్ లో టి వి మరియు సినిమా పరిశ్రమ ను అభివృద్ధి చేయడానికి, టి వి సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి నా వంతు కృషి చేస్తాను." త్వరలో చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు అయన చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments