Ambati Rayudu:బిగ్ బ్రేకింగ్: వైసీపీకి ఊహించని షాక్.. అంబటి రాయుడు రాజీనామా..

  • IndiaGlitz, [Saturday,January 06 2024]

వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల పార్టీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. 'వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా' అంటూ ట్వీట్ చేశారు.

కాగా డిసెంబర్ 28వ తేదీన సీఎం జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పట్టుమని పది రోజులు కూడా కాకుండానే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

రాయుడు పార్టీలో చేరడంతో ఆయనను గుంటూరు లేదా వైజాగ్ ఎంపీగా పోటీ చేయించాలని అధిష్టానం భావించింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. అయితే ఈలోపే రాయుడు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడం వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది.

More News

Pawan:పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకు.. దోచుకునేందుకే కొత్త చట్టం: పవన్

సీఎం జగన్ దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే భూహక్కుల చట్టం తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆరోపించారు.

Keshineni Nani:టీడీపీకి రాజీనామా చేస్తా.. మరో బాంబ్ పేల్చిన కేశినేని నాని..

విజయవాడం ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) మరో బాంబ్ పేల్చారు. త్వరలోనే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు.

Kapu Ramachandra Reddy: జగన్‌ను నమ్మి సర్వనాశనం అయ్యా.. వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా..

ఇంఛార్జ్‌ల మార్పు అధికార వైసీపీలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారు.

BRS Party: బీఆర్ఎస్ పార్టీకి 'డూ ఆర్ డై'.. తెలంగాణ నినాదం ఫలిస్తుందా..?

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు చావోరేవో కానున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బలంగా ఎదుర్కోవాలంటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీ సీట్లు గెలవాలని

Suriya:విజయ్‌కాంత్ సమాధి వద్ద బోరున ఏడ్చేసిన హీరో సూర్య

దివంగత కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌(vijayakanth) సమాధి వద్ద స్టార్ హీరో సూర్య(Suriya) నివాళులర్పించారు.