Ambati Rayudu: జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

ఏపీ రాజకీయాలు ఏ క్షణం ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఊహించడం కష్టమౌతోంది. ఎవరూ ఎప్పుడూ ఏ పార్టీలో చేరతారో అర్థం కావడం లేదు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో రాయుడు భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై పవన్‌తో చర్చించిన రాయుడు.. జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

క్రికెటర్‌గా సత్తా చాటిన రాయుడు కొద్ది కాలంగా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. గుంటూరు ఎంపీ సీట్ ఆశించిన ఆయన.. ఆ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అనంతరం ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ వారం రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీలో ఒక్కసారిగా కలవరం రేగింది.

గుంటూరు ఎంపీ సీట్ ఆశించిన రాయుడుకు.. మచిలీపట్నం లేదా వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ సూచించినట్లు చెబుతున్నారు. అయితే అందుకు ఇష్టపడని రాయుడు ఏకంగా పార్టీకి బై బై చెప్పేశారు. అయితే తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో చెబుతూ రాయుడు క్లారిటీ ఇచ్చారు. ‘జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు. అందుకే నేను వైసీపీకి రాజీనామా చేసినట్లు’ పేర్కొన్నారు.

కానీ తాజాగా పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు కాపు నాయకుడు పెట్టిన పార్టీలో చేరితే రాజకీయంగా తనకు భవిష్యత్ ఉంటుందని ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో త్వరలోనే రాయుడు జనసేనలో చేరడం ఖాయంగా వెల్లడిస్తున్నారు.

More News

Chandrababu: బ్రేకింగ్: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, లిక్కర్, ఇసుక కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.

Mahesh Babu: థ్యాంక్యూ మై హోమ్‌టౌన్ గుంటూరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న 'గుంటూరు కారం' సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

Kesineni Nani: వైసీపీలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని.. జగన్‌తో భేటీ..?

ఎన్నికల వేళ విజయవాడ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. టీడీపీకి దూరమైన ఎంపీ కేశినేని నాని, ఆయన కుమార్తె శ్వేత వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్.. ప్రయాణికులకు గాయాలు..

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. చెన్నైలోని తాంబరం నుంచి హైదరాబాద్ వచ్చిన చార్మినార్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది.

Mahesh Babu: ఇక నుంచి మీరే అమ్మ, నాన్న.. 'మావా ఎంతైనా' అంటున్న మహేష్..

మరో రెండు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. మంగళవారం రాత్రి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను