ఓటమి భయంతో బాబు పిచ్చి పిచ్చి మాటలు: అంబటి
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కీలక నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు గుప్పించారు. బుధవారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈవీఎంలపై చంద్రబాబుకు నాడు లేని అనుమానాలు నేడు ఎందుకు ఉన్నాయని, ఈసీని అవమానించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఓటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, పిల్లి మొగ్గలు వేస్తున్నారని విమర్శించారు. అనుభవం ఉన్న చంద్రబాబుకు రూల్స్ తెలియవా అని ప్రశ్నించారు.
చూడలేదా? మరిచిపోయారా?
"50 శాతం వీవీప్యాడులు లెక్కించాలని కోరడం అనుభవంతో కూడిన నాయకులు కోరాల్సిన అంశమేనా? 50 శాతం లెక్కించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు చెప్పిన తరువాత కూడా చంద్రబాబు ఈసీ వద్దకు వెళ్లి లెక్కించాలని కోరడం ఏంటో? చంద్రబాబు ఈవీఎంలపై చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ఈవీఎంలు వాడుకలో ఉన్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసిన సమయంలో కూడా ఈవీఎంలే ఉన్నాయి. చంద్రబాబు ఈవీఎంలపై పోరాటం చేయడంతో వీవీ ప్యాడ్‌లు వచ్చాయి. చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ.. తాను ఓటు వేస్తే ఎవరికి పడిందో అంటూ ఎన్నికల కమిషన్‌నే అవమానించే విధంగా వ్యాఖ్యానించారు.
మీరు పోరాడి సాధించిన వీవీపాడ్‌లో ఎవరికి ఓటు పడిందో చూడలేదా? మరిచిపోయారా? సైకిల్‌కు ఓటు వేస్తే ఫ్యాన్ గుర్తుకు పడిందని చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నారు. బాధ్యత గల నాయకుడైతే చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఇంత కష్టపడి ఈవీఎంలు, వీవీపాడులు తీసుకొస్తే అవహేళనగా మాట్లాడటం చంద్రబాబుకు తగదు. చంద్రబాబు దుర్దేశంతో మాట్లాడుతున్నారు. తాను ఓడిపోతే తన పరిపాలన వల్ల జరిగిన తప్పు కాదాని, కేవలం ఈవీఎంల వల్లే ఓడిపోయినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఇది దుర్మార్గమైన ఆలోచన. వ్యవస్థలపై నమ్మకంతో వ్యవహరించాలి" అని అంబటి రాంబాబు కోరారు. అయితే అంబటి వ్యాఖ్యలపై చంద్రబాబు అండ్ కో నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments