ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ కన్నుమూత
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్(66)అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలంగా శ్వాసకోసం సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో శనివారం రాత్రి కన్నుమూశారు. కర్ణాటకలో మండ్య జిల్లా మద్దూరు తాలూకా దొడ్డరకినకెరె గ్రామంలో 1952 మే 29న ఆయన హుచ్చేగౌడ, పద్మమ్మ దంపతులకు జన్మించిన . మలవళ్లి హుచ్చేగౌడ అమరనాథ్ అలియాస్ అంబరీష్ కన్నడ చిత్ర సీమలో రెబల్‌స్టార్‌గా ఖ్యాతి నార్జించారు. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా సేవలను అందించారు.
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అనారోగ్య సమస్య ఎక్కువ కావడంతో బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్‌కు ఆయన్ను తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్సను కొనసాగించినా ఫలితం లేకపోయింది. పది గంటలకు ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. నటి సుమలతను ఈయన ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్ అనే కుమారుడు ఉన్నారు. అభిషేక్‌ను హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంబరీష్‌ను వెండితెరపై హీరోగా చూడక మునుపే అంబరీష్ కన్నుమూశారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments