Ambajipeta Marriage Band: ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో సుహాస్ హీరోగా ఇటీవల విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‘ చిత్రం డిసెంట్ హిట్ అయింది. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా తొలి రోజు ఏకంగా రూ.2కోట్లకు పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. విమర్శలకు నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. చిత్రంలో సుహాస్, శరణ్య ప్రదీప్, 'పుష్ప' జగదీశ్, ప్రతాప్ బండారి తదితరులు నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. దీంతో థియేటర్లలో చూడని వాళ్లు ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆహా సంస్థ స్ట్రీమింగ్‌పై కీలక ప్రకటన చేసింది. మార్చి 1 నుంచి ఈ సినిమా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు సుహాస్‌తో షూట్ చేసిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో అభిమానులు మూవీని చూసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ సినిమా విషయానికొస్తే అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సభ్యుడైన హీరో చిరతపూడిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. తన అక్క శరణ్య ప్రదీప్ ఆ ఊరి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. అయితే ఊరి పెద్దకు సుహాస్ అక్కకు అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి పెద్ద చెల్లెలతో హీరో ప్రేమలో పడతాడు. ఇది తెలిసిన తర్వాత ఆ ఊరిలో ఎలాంటి పరిణామాల జరిగాయి..? ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాల్ని చాలా చక్కగా భావోద్వేగాలతో చూపించారు. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇదిలా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన సుహాస్.. హీరోగా మంచి గుర్తింపు పొందాడు. 'కలర్ ఫొటో', 'రైటర్ పద్మభూషణ్' లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అలాగే విలన్ పాత్రల్లోనూ అదరగొట్టాడు. 'హిట్: ది సెకండ్ కేసు'లో సైకో కిల్లర్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చిన్న హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'ఆనందరావ్ అడ్వంచర్స్', 'కేబుల్ రెడ్డి' చిత్రాల్లో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com