Bigg Boss 7 Telugu : రతిక - ప్రశాంత్ గొడవ, శివాజీ పవర్ అస్త్రను కొట్టేసిన అమర్‌దీప్ , ఇంట్లో గలాటా
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు 7 విజయవంతంగా మూడో వారానికి చేరుకుంది. సోమవారం నామినేషన్స్ పర్వంగా ముగియగా.. ఎప్పటిలాగే గొడవలు, ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే టేస్టీ తేజను సేవ్ చేసి .. అమర్‌దీప్ చౌదరిని సందీప్, శివాజీలు నామినేట్ చేసిన వ్యవహారం ఇంటి సభ్యుల మధ్య చిచ్చురాజేసింది. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సందీప్.. శోభాశెట్టితో చెప్పాడు. లాస్ట్ వీక్ ప్రశాంత్‌కి ఎక్కువ ఓట్లు పడ్డాయని.. ఈసారి అయితే అమర్‌ని తట్టుకోగలడని, కచ్చితంగా సేవ్ అవుతాడని సందీప్ వ్యాఖ్యానించాడు.
ఇక ఇంటి సభ్యులు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పిండితో ముద్దలా చేసి.. దానితో గణేశుడి విగ్రహాన్ని తయారు చేసుకుని పూజలు నిర్వహించారు. పండుగ జోష్‌లో వుండగా పెంట పెట్టేందుకు బిగ్‌బాస్ సిద్ధమయ్యాడు. మూడో పవర్ అస్త్ర కోసం తాను అమర్‌దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్‌లను సెలక్ట్ చేసినట్లు చెప్పాడు. దీంతో తాము అర్హులం కాదా అంటూ మిగిలిన ఇంటి సభ్యులు మండిపోయారు. పల్లవి ప్రశాంత్ అయితే ఏదో జరిగిపోయినట్లుగా తెగ కుమిలిపోయాడు. ఆ వెంటనే పల్లవి ప్రశాంత్‌ను సముదాయించడానికి బిగ్‌బాస్ అతనిని కన్ఫెషన్ రూంకి పిలిచాడు. తాను ఎంపిక చేసిన ముగ్గురిలో నీకు ఎవరైనా అనర్హులుగా అనిపిస్తే వారి పేర్లు చెప్పమన్నాడు. దీంతో ప్రశాంత్ శోభాశెట్టి పేరు చెప్పాడు.
అతను బయటకు వెళ్లిన తర్వాత ఇప్పటికే పర్మినెంట్ హౌస్‌మేట్స్‌గా నిలిచిన సందీప్, శివాజీ.. కొత్తగా సెలక్ట్ అయిన ముగ్గురు (అమర్‌దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్)లు కాకుండా మిగిలిన వారిని పిలిచి సేమ్ ప్రశాంత్‌కిచ్చిన టాస్కే ఇచ్చాడు . దీనిలో భాగంగా ప్రశాంత్ .. శోభాశెట్టిని, ప్రియాంక.. అమర్‌దీప్, శుభశ్రీ.. శోభాశెట్టి, తేజ.. ప్రిన్స్ యావర్, దామిని.. ప్రిన్స్ యావర్, గౌతమ్.. శోభాశెట్టి, రతిక... ప్రిన్స్ యావర్‌లను అనర్హులుగా చెప్పారు.
ఇంతలో శివాజీ పవర్ అస్త్రను అమర్‌దీప్ కొట్టేశాడు. దీనిపై ఇంట్లో పెద్ద రచ్చ నడిచింది. ఇది అమర్‌దీప్ పనేనంటూ పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు.. కానీ అమర్ తాను తీయాలేదంటూ మ్యానేజ్ చేసుకోగలిగాడు. కానీ శివాజీ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టలేదు. పవర్ అస్త్ర కోసం బరిలో నిలిచిన అమర్‌దీప్, ప్రిన్స్, శోభాశెట్టిలకు వచ్చిన బ్యాచ్‌లను లాక్కున్నాడు. నా పవర్ అస్త్ర సంగతి తేలిన తర్వాతే వీటిని ఇస్తానని తెగేసి చెప్పాడు. ఇవాళ్టీ ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్- రతిక గొడవ హైలెట్‌గా నిలిచింది. నువ్వు పో అంటే నువ్వు పో అనుకుంటూ వీరు గిల్లికజ్జాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో నువ్వు పో అంటూ రతికపై ప్రశాంత్ చేయి వేయడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు చేయి వేసి మాట్లాడకు అంటూ వార్నింగ్ ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com