Bigg Boss Telugu 7 : శోభాశెట్టికి ఎలిమినేషన్ భయం.. ప్రశాంత్‌ను కొరికేసిన అమర్, ఆపై మాటలతో ఎదురు దాడి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 తుది అంకానికి చేరుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది. ప్రస్తుతం ఇంటి సభ్యులు ప్రేక్షకులతో ఓటు అప్పీల్ చేసుకునేందుకు బిగ్‌బాస్ అవకాశం కల్పిస్తున్నాడు. ఇందుకు గాను పలు గేమ్స్ ఆడిస్తున్నాడు. ఇప్పటి వరకు శోభాశెట్టి ఓటు అప్పీల్‌ను గెలుచుకోగా.. నిన్న టాస్క్‌ల్లో గెలిచిన అర్జున్‌కు , అమర్‌దీప్‌లలో ఓటు అప్పీల్ ఎవరికి ఇవ్వాలో తేల్చాలంటూ కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ ఆదేశించాడు. ప్రియాంకా, శోభాశెట్టి మినహా మిగిలిన వారంతా అర్జున్‌కే ఓటేశారు. అయితే ఓటింగ్ విషయంలో స్పై బ్యాచ్‌తో అమర్దీప్ గొడవకు దిగాడు. తాను ఈ వారం ఎలిమినేషన్లో ఉండటం, అర్జున్‌కు ఆ ముప్పు లేకపోవడంతో తనకు ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించాలని అమర్దీప్ ప్రాధేయపడ్డాడు. కానీ స్పై బ్యాచ్ కరాఖండీగా నో అని చెప్పేసింది.
తర్వాత ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. హౌస్‌లోని కంటెస్టెంట్స్ అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు. కంటెస్టెంట్స్ ఒక లైన్లో వుంటూ వారి వద్ద వున్న బాల్స్‌ను తను ప్రత్యర్ధులు అనుకున్న ఇంటి సభ్యుల టీ షర్ట్స్పై విసరాలి. ఎవరి టీ షర్ట్స్‌కు ఎక్కువ బంతులు అంటుకుంటాయో వారు ఔటైనట్లు. ఈ టాస్క్‌లో శోభా, ప్రిన్స్ యావర్ మధ్య గొడవ జరుగుతుంది. తనను కావాలని ఆట నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేసిందంటూ యావర్ రగిలపోతాడు. చీ.. ఛీ.. ఛీ అంటూ శోభను ఉద్దేశించి కామెంట్ చేశాడు. శోభా కూడా రివర్స్ అయినప్పటికీ యావర్ మాత్రం తగ్గలేదు. పరిస్ధితి చేయి దాటేలా వుండటంతో తనను కంట్రోల్ చేయడానికి శివాజీ యత్నించాడు. చాలా రోజులుగా తాను కంట్రోల్లోనే వున్నానని, కానీ కావాలని తనను టార్గెట్ చేస్తున్నాడని యావర్ చెప్పాడు.
మరోవైపు .. అమర్దీప్, ప్రశాంత్ మధ్య వాడి వేడి చర్చ జరిగింది. తనను కొరికాడంటూ ప్రశాంత్ శోభకు చూపించాడు. అది తప్పేనని ఒప్పుకున్న అమర్.. ప్రశాంత్ చేసేవి మాత్రం కనిపించడం లేదన్నాడు. అక్కడితో ఆగకుండా అతనిని చెప్పుతో కొడతా అన్నట్లుగా సైగ చేశాడు. అమర్‌ను కంట్రోల్ చేయడానికి శోభాశెట్టి ప్రయత్నించింది. ఉంటే ఎంత.. పోతే ఎంత.. వీడి గురించి తెలియాలి అంటూ అమర్దీప్ కేకలు వేశాడు. వీరిద్దరి గొడవను చూసి సహనం కోల్పోయిన అర్జున్ .. నువ్వు కూర్చో, నువ్వు ఆపు అంటూ ఇద్దరిని గద్దించాడు. అయితే ప్రశాంత్ మాత్రం కాస్త సైలెంట్ అయ్యాడు.
ఇకపోతే.. ఈ వారం అర్జున్ తప్పించి శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్దీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, శోభాశెట్టిలు నామినేషన్స్‌లో వున్నారు. మరి వీరిలో ఎలిమినేట్ అయ్యేదెవరు..? గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టేదెవరు అనేది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది. అయితే ఈ వారం మిడ్ వీక్‌లో కానీ, వీకెండ్లో కానీ శోభా ఎలిమినేట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇవాళ టాస్క్ సందర్భంగా తను ఎలిమినేట్ అయిపోతానేమోనని శోభ భయపడింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com