Bigg Boss Telugu 7 : నమ్మకద్రోహమంటూ ప్రశాంత్ కంటతడి, శివాజీని టార్గెట్ చేసిన హౌస్మేట్స్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 7 తెలుగు తుది అంకానికి చేరుకుంది. మరికొద్దివారాల్లో షో ముగియనుంది. గత వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా రతిక, అశ్విని శ్రీలు హౌస్‌ను వీడారు. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో శివాజీ, అమర్దీప్ చౌదరి, అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్, శోభాశెట్టి, ప్రియాంకలు వున్నారు. ఇక్కడి నుంచి కంటెస్టెంట్స్‌కు టాప్ 5లో నిలిచేందుకు టఫ్ ఫైట్ కొనసాగనుంది. ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ హీటెక్కించాయి. శివాజీ - గౌతమ్, శోభాశెట్టి - ప్రశాంత్, ప్రియాంక - ప్రశాంత్ మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. నామినేషన్స్‌లో భాగంగా నరకం అనే కాన్సెప్ట్ పెట్టారు బిగ్‌బాస్. ఇందులో కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేయాలనుకునే ఇద్దరి బుగ్గలపై ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలి.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే :
శోభాశెట్టి.. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్
అమర్దీప్.. పల్లవి ప్రశాంత్, గౌతమ్
పల్లవి ప్రశాంత్.. శోభాశెట్టి, ప్రియాంక
ప్రియాంక..పల్లవి ప్రశాంత్, శివాజీ
శివాజీ.. అర్జున్, గౌతమ్
ప్రిన్స్ యావర్.. గౌతమ్, ప్రియాంక
గౌతమ్.. పల్లవి ప్రశాంత్, శివాజీ
అర్జున్ .. శివాజీ, ప్రియాంక
గౌతమ్‌కి, శివాజీకి తొలి నుంచి పడటం లేదన్న సంగతి తెలిసిందే. శివాజీ నిర్ణయాలు, ఆటను, స్ట్రాటజీని జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్న గౌతమ్ ఎప్పటికప్పుడు వాటిని తెలియజేస్తూ వస్తున్నాడు. శివాజీ బ్యాచ్ తనపై అంతెత్తున లేస్తున్నా కానీ ధైర్యంగా ఎదిరిస్తున్నాడు. ఇవాళ నామినేషన్ సందర్భంగా గతంలో జరిగిన విషయాలనే ప్రస్తావిస్తూ శివాజీని నామినేట్ చేశాడు. మీరు ఇద్దరికే సపోర్ట్ చేస్తున్నారంటూ .. SPY (శివాజీ, ప్రశాంత్, యావర్)ని తెరపైకి తీసుకొచ్చాడు. దీనికి శివాజీ ఘాటుగా బదులిచ్చాడు. నేనేమైనా ఆ కంపెనీ పెట్టానా ఏంటీ అంటూ ఫైర్ అయ్యాడు. జెన్యూన్‌గా వుండి, వీక్‌గా వున్న వారికే నా సపోర్ట్ అని శివాజీ తేల్చి చెప్పాడు. అయితే అప్పట్లో నా డాక్టర్ చదువు గురించి యావర్ తిట్టినా మీరు నాకు అండగా నిలబడలేదని గుర్తుచేశాడు.
అమర్దీప్- పల్లవి ప్రశాంత్ మధ్య గొడవ కూడా హైలెట్‌గా నిలిచింది. తనకు ఎంతో సపోర్ట్ చేసిన పల్లవి ప్రశాంత్‌ను అనూహ్యంగా అమర్ నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ నువ్వు స్టోర్ రూమ్‌కి వెళ్లి చనిపోవడం తనకు నచ్చలేదని, నీతో గేమ్ ఆడటం మిస్ అయ్యానంటూ రీజన్ చెప్పాడు. దీనికి పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను నామినేట్ చేస్తావని అనుకోలేదని కంటతడి పెట్టుకున్నాడు. నువ్వు నామినేట్ చేసినందుకు కాదు.. నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నానని ప్రశాంత్ కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ వారం ప్రశాంత్, శివాజీ, గౌతమ్, ప్రియాంక, యావర్, అర్జున్, శోభా శెట్టి నామినేషన్స్‌లో నిలిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments