Bigg Boss Telugu 7 : శోభాను గెలిపించిన అమర్‌దీప్ .. ఈ సీజన్‌లో తొలి లేడీ కెప్టెన్‌గా డాక్టర్ మోనిత, శివాజీపై గౌతమ్ ఫిర్యాదు

  • IndiaGlitz, [Saturday,November 04 2023]

బిగ్‌బాస్ 7 తెలుగులో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇంటి సభ్యులు వీర సింహాలు, గర్జించే పులులుగా విడిపోయి టాస్క్‌ల్లో పాల్గొంటున్నారు. అమర్‌దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, అశ్వినిలు గర్జించే పులులు టీమ్‌లో.. ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, టేస్టీ తేజ, గౌతమ్, రతికా, భోలేలు వీర సింహాలు టీంలో వున్నారు. గురువారం నాటి టాస్క్‌లో వీరసింహాలు జట్టు గెలవడంతో.. వీరికి బిగ్‌బాస్ ఓ పవర్ ఇచ్చాడు. మీ టీమ్‌లోకి వీకెస్ట్ కంటెంస్టెంట్‌ను .. ప్రత్యర్ధి టీమ్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌తో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో వీర సింహాలు టీమ్‌లోని భోలేను గర్జించే పులులకు అప్పగించి అర్జున్‌ని తీసుకున్నారు.

మరోవైపు.. గర్జించే పులుల జట్టు దగ్గర వున్న బాల్స్ కొట్టేసేందుకు వీర సింహాలు టీమ్ సభ్యులు ప్రయత్నించారు. ఈ క్రమంలో శివాజీకి వారికి వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ్టీ ఎపిసోడ్‌లో బ్లాక్‌బాల్ ఎవరి దగ్గరి వుందని బిగ్‌బాస్ అడిగాడు.. దీనికి వీరసింహాలు టీమ్ తమ వద్ద వుందని చెప్పడంతో.. వారికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చాడు. ఈ బ్లాక్ బాల్ సాయంతో ప్రత్యర్ధి జట్టు వద్ద వున్న అన్ని బంతులను తీసుకోవచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. అసలే గర్జించే పులుల టీమ్‌లోని బంతులను ఎలా కాజేయాలా అని చూస్తోన్న వారికి ఈ ఆఫర్ రావడంతో ఎగిరి గంతేశారు. కానీ శివాజీ, ప్రియాంక మాత్రం అన్ని బాల్స్ ఇవ్వకుండా రెండు బంతులు తమ దగ్గరే వుంచుకున్నారు.

దీనికి గౌతమ్ అభ్యంతరం తెలిపాడు. మీ దగ్గర రెండు బాల్స్ ఎలా వుంచుకుంటారని శివాజీపై కోప్పడతాడు. మీ ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండి అంటూ గౌతమ్ అసహనం వ్యక్తం చేశాడు. దీనికి శివాజీ .. మా ఇష్టం, ఏం చేయాలో బిగ్‌బాస్ చెబుతాడు.. నీకెందుకు వదిలేసేయ్ అని చెబుతాడు. అలా వీరిద్దరి మధ్య డిస్కషన్ పీక్స్‌కు వెళ్తుంది. మరోవైపు.. అన్ని బంతులు వీరసింహాలకే దక్కడంతో ఆ టీమ్‌లో వున్న అందరినీ కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్.

తర్వాత బిగ్‌బాస్.. బీన్ బ్యాగ్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అయితే ఇక్కడే షాకిచ్చాడు. వీరసింహాలు టీమ్‌లోని కెప్టెన్సీ కంటెండర్స్ కోసం గర్జించే పులులు టీమ్‌ సభ్యులు ఆడాలని చెబుతాడు. అంతేకాదు.. ఓ కెప్టెన్సీ కంటెండర్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని చెబుతాడు. దీంతో ప్రిన్స్ యావర్ టాస్క్ నుంచి తప్పుకున్నాడు. అలాగే బిగ్‌బాస్ షరతు ప్రకారం.. ఇప్పటి వరకు కెప్టెన్ కానీ రతిక, శోభాశెట్టి, తేజాల తరపున ఆడాలని .. గౌతమ్, అర్జున్ తరపున ఆడకూడదని గర్జించే పులులు టీమ్ డిసైడ్ అయ్యింది.. అయితే గౌతమ్ రిక్వెస్ట్ చేయడంతో అతని కోసం అశ్విని ముందుకొచ్చింది. ఒక ఒక్కడే మిగిలిపోయిన అర్జున్ కోసం తాను ఆడతానని శివాజీ చెప్పాడు.

టాస్క్ ప్రకారం.. కెప్టెన్సీ కంటెండర్లుగా వున్న వారి ఫోటోలు బీన్ బ్యాగులపై వుంటాయి. వీటిలో తమకు నచ్చిన వారి బ్యాగ్‌ను గర్జించే పులులు టీమ్ ధరించి.. అది ఖాళీ కాకుండా చూడాల్సి వుంటుంది. గేమ్ మొదలయ్యాక.. గౌతమ్ తరపున అశ్విని, అర్జున్ తరపున శివాజీ, తేజ తరపున ప్రియాంక, రతిక తరపున భోలే షావళి, అర్జున్ కోసం శివాజీ బరిలోకి దిగారు. ఈ ఆటలో అమర్ , అశ్విని కొట్టుకున్నారు. మరోవైపు.. ఆట ఆడే క్రమంలో శివాజీ చేయి కదలడంతో ఆయన నొప్పి భరించలేకపోయారు. దీంతో ఆయనను మెడికల్ టెస్ట్ కోసం పంపించారు.

శివాజీ ఆడే పరిస్ధితిలో లేకపోవడంతో అర్జున్‌ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించాలని బిగ్‌బాస్ ప్రకటించాడు. చివరికి ప్రియాంక, అమర్‌లు హోరాహోరీగా తలపడ్డారు. ప్రియాంక టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ .. అమర్‌ ధీటుగా ఆడి శోభాశెట్టిని కెప్టెన్‌ను చేశాడు. అంతేకాదు.. ఈ సీజన్‌లో తొలి ఫిమేల్ కెప్టెన్‌గా శోభ నిలిచింది. కెప్టెన్సీ టాస్క్ ముగిశాక.. శివాజీ ఆటతీరుపై గౌతమ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆయన ముందే మ్యాచ్‌ను ఫిక్స్ చేస్తున్నాడని.. ఇది తాను భరించలేకపోతున్నానని, తప్పయితే తనను ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ కెమెరాల వంక చూస్తూ ఫిర్యాదు చేశాడు.

More News

MIM Party:ఎంఐఎం పార్టీ కీలక ప్రకటన.. 9 స్థానాల్లో పోటీకి సై..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీపై ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంచుకోట స్థానాలైన ఏడు నియోజకవర్గాలతో

AP Cabinet:కులగణనకు గ్రీన్ సిగ్నల్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

Ramakrishna Reddy:కాంగ్రెస్‌కు షర్మిల మద్దతు ఇవ్వడంపై.. సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ఎన్నికల్లో పోటీకి వైసీటీపీ అధినేత షర్మిల దూరం కావడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  కీలక వ్యాఖ్యలు చేశారు.

Rishabh Pant and Akshar Patel:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్

భారత క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

KCR Kasani:బీఆర్ఎస్‌లో చేరిన కాసాని.. సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు.