సింగపూర్‌లో చికిత్స పొందుతూ అమర్ సింగ్ మృతి
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్(64) మృతి చెందారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతున్నారు. కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఇటీవలే ఆయనకు కిడ్నీ మార్పిడి సైతం జరిగింది. ఆరోగ్యం కాస్త కుదుటపడుతోందనుకున్న సమయంలో ఒక్కసారిగా పూర్తిగా క్షీణించి శనివారం తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్‌కు అమర్ సింగ్ అత్యంత సన్నిహితుడు. సమాజ్‌వాదీ పార్టీలో రెండవ స్థానంలో కొనసాగుతున్న అమర్‌సింగ్ పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకునేవారు. ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ పటిష్టానికి ఆయన కృషి శ్లాఘనీయం. 2008లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి అను ఒప్పంద విషయంలో సమాజ్‌వాదీ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలోనూ అమర్‌సింగ్ కీలకంగా వ్యవహరించారు.
అటు కాంగ్రెస్ పార్టీతోనూ ఇటు వ్యాపారం, సినిమా అంటూ అన్ని రంగాల వారితోనూ అమర్‌సింగ్‌కి సన్నిహిత సంబంధాలుండేవి. కాగా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా 2010లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి అమర్ సింగ్‌ను ములాయం బహిష్కరించారు. దీంతో ఆయన 2011లో రాష్ట్రీయ లోక్‌మంచ్ అనే కొత్త పార్టీని స్థాపించారు. అయితే 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా ఆయన పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. కాగా.. 2016లో తనను బహిష్కరించిన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతోనే ఆయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడం విశేషం. 1996లో తొలిసారి యూపీ నుంచి రాజ్యసభకు అమర్‌సింగ్ ఎన్నికయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments