Bigg Boss Telugu 7: ‘"ఒక్క ఛాన్స్ అన్నా.." శివాజీని వేడుకున్న అమర్‌దీప్, షాకిచ్చిన బిగ్‌బాస్.. తెగేదాకా లాగితే ఇంతే
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు చివరి దశకు చేరుకుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుండగా.. ఈ సీజన్‌కు లాస్ట్ కెప్టెన్ ఎవరో ఈ వారం తేలిపోనుంది. గ్రాండ్ ఫినాలేకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం మధ్య నాటికి టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో తేలిపోనుంది. ఇకపోతే.. కిల్లర్ టాస్క్ సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయడంతో అమర్‌దీప్, అర్జున్‌లను బిగ్‌బాస్ ప్రశంసించాడు. ఆ వెంటనే కెప్టెన్సీ టాస్క్ మొదలుపెట్టాడు. దీని ప్రకారం గన్ షూటింగ్ సౌండ్ వినిపించగానే.. గార్డెన్ ఏరియాలో వున్న మెషీన్ గన్ దగ్గర ఏ ఇద్దరైతే ముందుగా నిల్చొని .. కిల్లింగ్ జోన్‌లో వున్న ఇద్దరిలో ఎవరు కెప్టెన్సీ రేసులో వుండాలో, ఎవరు కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాలో డిసైడ్ చేయాలి అని బిగ్‌బాస్ చెప్పాడు.
ఈ గేమ్‌లో ఒక్కొక్కరిని తప్పిస్తూ పోగా అమర్, అర్జున్‌లు మిగిలారు. శోభాశెట్టి, శివాజీల చేతిలో తుది నిర్ణయం వుంది. శివాజీ అర్జున్‌కు సపోర్ట్ చేసి అందుకు రీజన్ చెప్పాడు. ఆయన భార్య తన భర్తను కెప్టెన్‌ని చేయమని అడిగిందని, అందుకోసమే అర్జున్‌కి మద్ధతు ఇచ్చినట్లు శివాజీ చెప్పాడు. శోభాశెట్టి అమర్‌దీప్‌కి సపోర్ట్ చేసింది. అయితే శివాజీ సపోర్ట్ పొందేందుకు గాను అమర్ బతిమలాడటం మొదలుపెట్టాడు. అర్ధం చేసుకో అన్నా.. ప్లీజ్ అన్నా అంటూ ప్రాధేయపడ్డాడు. రాక రాక ఛాన్స్ వచ్చింది పోగొట్టొద్దు అన్నా .. నీకు దండం పెడతా.. మా పేరెంట్స్ కూడా ఆశలు పెట్టుకున్నారని చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. శోభా శెట్టి సైతం నిర్ణయం మార్చుకోవాల్సిందిగా శివాజీని బతిమలాడింది. ఎవరు ఎన్ని చెప్పినా శివాజీ మనసు మాత్రం కరగలేదు.. అర్జున్‌కే తన సపోర్ట్ అని తేల్చిచెప్పేశాడు.
హౌస్‌మేట్స్ అంతా కెప్టెన్ ఎవరైతే బాగుండు అన్న దానిపై సీరియస్‌గా డిస్కషన్ మొదలుపెట్టి టైం గడిచిపోతున్న విషయాన్ని పక్కనబెట్టారు. బిగ్‌బాస్ పలుమార్లు హెచ్చరించినా ఎవ్వరూ వినే స్థితిలో లేరు. దీంతో ఈ వారం కెప్టెన్సీని రద్దు చేస్తున్నట్లు బిగ్‌బాస్ ప్రకటించారు. చివరిలో మెత్తబడ్డ శివాజీ తాను అమర్‌దీప్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అర్జున్‌తో పాటు అమర్‌దీప్ ఫోటో కూడా కాలిపోయింది. ఈ దెబ్బకు కంటెస్టెంట్స్‌కు దిమ్మ తిరిగిపోయింది. కెప్టెన్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమర్‌దీప్, అర్జున్‌ల ఫేస్‌లలో బాధ కళ్లకు కట్టినట్లు కనిపించింది.
అయితే బిగ్‌బాస్ తీసుకున్నదే తుది నిర్ణయమా.. ? లేక శనివారం నాగార్జున వచ్చి ఏమైనా మార్పులు చేస్తాడా అన్నది తేలాల్సి వుంది. ఇకపోతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ వుంటుందని నాగార్జున చెప్పడంతో కంటెస్టెంట్స్‌లో టెన్షన్ పట్టుకుంది. ఈ వారం శివాజీ, ప్రశాంత్, అర్జున్, అమర్‌దీప్, అశ్విని, గౌతమ్, రతిక, ప్రిన్స్ యావర్ నామినేషన్స్‌లో వున్నారు. మరి వీరిలో ఏ ఇద్దరు బిగ్‌బాస్ హౌస్‌ను వీడుతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments