రివేంజ్ కాదు.. రిటర్న్ గిఫ్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందిన నాలుగో చిత్రం `అమర్ అక్బర్ ఆంటోని`. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 16న విడుదలవుతుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
`ఈ లోకంలో శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోనోళ్లు కొందరుంటే.. శక్తి మేరకు నయవంచన చేసే వాళ్లు కోకొల్లలు..` అని శ్రీను వైట్ల గొంతుతో ట్రైలర్ మొదలైంది
`ఆర్ యు ష్యూర్ యు విల్ నాట్ కమ్ హియర్.. ఐయామ్ ష్యూర్ సార్ ఐ విల్ నెవర్ ఎవర్ కమ్ హియర్ ఎగెయిన్` అని రవితేజ ఎవరితోనో చెబుతాడు.
ఆంటోని క్యారెక్టర్లో రవితేజ డాక్టర్‌గా కనపడతాడు... ఇలియానా మదర్ థెరిసాగా ..బాక్సర్ పాత్రలో కనపడింది. అక్బర్ క్యారెక్టర్లో డిఫరెంట్ తెలుగు యాస మాట్లాడుతూ మరో క్యారెక్టర్లో రవితేజ కామెడీ యాంగిల్ కనపడుతుంది.
`డాక్టర్‌గారు ఏ టైమ్‌కి వస్తారండి`.. అని ఇలియానా సునీల్‌ను అడిగితే `డాక్టర్‌గారూ వచ్చేది టైమ్‌ను బట్టి కాదు..సిచ్యువేషన్‌ని బట్టి` అని సునీల్ ఇలియానాతో అంటాడు..
`మేం వెయిట్ చేయొచ్చా` అని ఇలియానా అంటే సునీల్ `మీ ఓపిక` అని అంటాడు. అప్పటి వరకు ఎంటర్టైనింగ్ ట్రైలర్లో విలన్స్, వారి ఎంట్రీలతో ఓ సీరియెస్నెస్ సంతరించుకుంటుంది.
`చెడ్డవాళ్ల నుండి చెడును ఎక్స్పెక్ట్ చేయకపోవడం పిచ్చితనం` అని ఆదిత్య మీనన్ డైలాగ్ ...
`ఇట్స్ నాట్ ఎ రివేంజ్.. ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్ `.. అని రవితేజ డైలాగ్
రవితేజ పోషించిన మూడు పాత్రల చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఆయా పాత్రల సన్నివేశాలు నుండి సందర్భానుసారం వచ్చే కామెడీ .. అలాగే ఓ రివేంజ్ కోసం రవితేజ మూడు పాత్రలు పోషించడం అనే విషయాలు అవగతమవుతాయి. తమన్ మ్యూజిక్.. వెంకట్ సి.దిలీస్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నవంబర్ 16న సినిమా విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com