రివేంజ్ కాదు.. రిట‌ర్న్ గిఫ్ట్‌

  • IndiaGlitz, [Sunday,November 11 2018]

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో రూపొందిన నాలుగో చిత్రం 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం న‌వంబ‌ర్ 16న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

'ఈ లోకంలో శ‌క్తి చాల‌క న‌మ్మ‌కం నిల‌బెట్టుకోనోళ్లు కొంద‌రుంటే.. శ‌క్తి మేర‌కు న‌య‌వంచ‌న చేసే వాళ్లు కోకొల్ల‌లు..' అని శ్రీను వైట్ల గొంతుతో ట్రైల‌ర్ మొద‌లైంది

'ఆర్ యు ష్యూర్ యు విల్ నాట్ క‌మ్ హియ‌ర్‌.. ఐయామ్ ష్యూర్ సార్ ఐ విల్ నెవ‌ర్ ఎవ‌ర్ క‌మ్ హియ‌ర్ ఎగెయిన్' అని ర‌వితేజ ఎవ‌రితోనో చెబుతాడు.

ఆంటోని క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ డాక్ట‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడు... ఇలియానా మ‌ద‌ర్ థెరిసాగా ..బాక్స‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డింది. అక్బ‌ర్ క్యారెక్ట‌ర్‌లో డిఫ‌రెంట్ తెలుగు యాస మాట్లాడుతూ మ‌రో క్యారెక్ట‌ర్‌లో ర‌వితేజ కామెడీ యాంగిల్ క‌న‌ప‌డుతుంది.

'డాక్ట‌ర్‌గారు ఏ టైమ్‌కి వ‌స్తారండి'.. అని ఇలియానా సునీల్‌ను అడిగితే 'డాక్ట‌ర్‌గారూ వ‌చ్చేది టైమ్‌ను బ‌ట్టి కాదు..సిచ్యువేష‌న్‌ని బ‌ట్టి' అని సునీల్ ఇలియానాతో అంటాడు..

'మేం వెయిట్ చేయొచ్చా' అని ఇలియానా అంటే సునీల్ 'మీ ఓపిక' అని అంటాడు. అప్ప‌టి వ‌ర‌కు ఎంట‌ర్‌టైనింగ్ ట్రైల‌ర్‌లో విల‌న్స్‌, వారి ఎంట్రీల‌తో ఓ సీరియెస్‌నెస్ సంత‌రించుకుంటుంది.

'చెడ్డ‌వాళ్ల నుండి చెడును ఎక్స్‌పెక్ట్ చేయ‌క‌పోవ‌డం పిచ్చిత‌నం' అని ఆదిత్య మీన‌న్ డైలాగ్ ...

'ఇట్స్ నాట్ ఎ రివేంజ్‌.. ఇట్స్ ఎ రిట‌ర్న్ గిఫ్ట్ '.. అని ర‌వితేజ డైలాగ్‌

ర‌వితేజ పోషించిన మూడు పాత్ర‌ల చుట్టూనే క‌థంతా తిరుగుతుంది. ఆయా పాత్ర‌ల స‌న్నివేశాలు నుండి సందర్భానుసారం వ‌చ్చే కామెడీ .. అలాగే ఓ రివేంజ్ కోసం ర‌వితేజ మూడు పాత్ర‌లు పోషించ‌డం అనే విష‌యాలు అవ‌గ‌త‌మవుతాయి. త‌మ‌న్ మ్యూజిక్‌.. వెంక‌ట్ సి.దిలీస్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. న‌వంబ‌ర్ 16న సినిమా విడుద‌ల‌వుతుంది.