బ‌లగం కాదు.. బ‌లం ఉండాలంటున్న 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'

  • IndiaGlitz, [Monday,October 29 2018]

ర‌వితేజ మూడు షేడ్స్‌లో ఇలియానా జోడిగా న‌టిస్తున్న చిత్రం 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని'. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై శ్రీనువైట్ల దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రమిది. న‌వంబ‌ర్ 16న విడుద‌ల కాబోయే ఈ సినిమా టీజ‌ర్ నేడు విడుద‌లైంది. సినిమా ఎక్కువ భాగం యుఎస్‌లోనే చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది.

'వెంకీ', 'దుబాయ్ శీను' చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్ర‌మిది. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. టీజ‌ర్ 'ముగింపు రాసుకున్న త‌ర్వాతే క‌థ‌ను మొద‌లు పెట్టాలి.. నిజ‌మైన ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడు మ‌న‌ల్ని కాపాడేది మ‌న చుట్టూ ఉన్న బ‌లగం కాదు, మ‌న‌లో ఉన్న బ‌లం... వాడు ఎక్క‌డ ఉంటాడో,  ఎలా ఉంటాడో, ఎక్క‌డి నుండి వ‌స్తాడో ఎవ‌రికీ తెలియ‌దు.అని విల‌న్ చెప్ప‌డం. చివ‌ర‌ల్లో ర‌వితేజ రిలాక్స్ అన‌డం.. వాడు నాకు మాటిచ్చాడు.

త‌ప్ప‌కుండా వ‌స్తాడు అని ఇలియానా చెప్ప‌డం ఇవి టీజ‌ర్‌లోని ప్ర‌ధానమైన డైలాగ్స్‌. వెంక‌ట్ సి.దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమా మొత్తం ర‌వితేజ హీరోయిజాన్ని బేస్ చేసుకుని ర‌న్ అయ్యే రివేంజ్ డ్రామాలా క‌న‌ప‌డుతుంది.