నవంబర్ 16న అమర్ అక్బర్ ఆంటోనీ విడుదల

  • IndiaGlitz, [Monday,October 29 2018]

ర‌వితేజ‌, ఇలియానా జంట‌గా న‌టిస్తున్న అమ‌ర్ అక్బర్ ఆంటోనీ టీజర్ విడుదలైంది. ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. ఇందులో ర‌వితేజ మూడు భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూడింటినీ టీజ‌ర్ లో హైలైట్ చేసారు ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌. టీజ‌ర్ చాలా కొత్త‌గా.. సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ఉంది.

మ‌నం ఆపద‌లో ఉన్న‌పుడు మ‌న‌ల్ని కాపాడేది మ‌న చుట్టూ ఉన్న బ‌ల‌గం కాదు.. మ‌న‌లో ఉన్న బ‌లం.. ముగింపు రాసుకున్న త‌ర్వాతే ఆరంభించాలి అనే డైలాగ్స్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. అమెరికాలోని అంద‌మైన లొకేష‌న్స్ లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు శ్రీనువైట్ల‌.

ఈ సినిమాలో ల‌య‌, సునీల్,వెన్నెల కిషోర్,ర‌ఘు బాబు,త‌రుణ్ అరోరా,అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల‌తో క‌థల ఎంపికపై ప్ర‌త్యేక‌త చూపిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. న‌వంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.

More News

యదార్ద సంఘటనల ఆధారంగా 'పలాస 1978'

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. "పలాస 1978" పేరు తొ కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

గిన్నిస్‌కు రెండేళ్ల చిన్నారి చిత్రం 'పీహు'

మైరా విశ్వ‌క‌ర్మ అనే రెండేళ్ల చిన్నారి న‌టించిన చిత్రం 'పీహు'. రూ.45 ల‌క్ష‌ల‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ వినోద్ కాప్రి తెర‌కెక్కిస్తున్నారు.

కేసీఆర్ పాత్ర‌లో సీనియ‌ర్ హీరో

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు జీవిత చ‌రిత్ర ఆధారంగా 'తెలంగాణ దేవుడు' అనే సినిమా రూపొంద‌నుంది.

హృతిక్ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోష‌న్, వికాస్ బాలి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం 'సూప‌ర్ 30'. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన గ‌ణిత మేధావి ఆనంద్‌కుమార్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌తో నితిన్‌...

ఛ‌ల్ మోహ‌న్ రంగ సినిమా త‌ర్వాత నితిన్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా  చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.