మన్మథుడి పక్కన ఛాన్స్.. ఎగిరిగంతులు వేయాల్సిందిపోయి, ఈ డిమాండ్లు ఏంటీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ అక్కినేని నాగార్జున సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే బంగార్రాజును శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన .. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమాను పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగ్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌తో పాటు నాగార్జున ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'ది ఘోస్ట్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వర్షంలో రక్తంతో తడిసిన కత్తి పట్టుకొని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ప్యాక్ లుక్‌లో కింగ్ అదరగొడుతున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీలుక్‌తో పాటు పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న విదేశీ బ్యాడ్డీలు, లండన్ ల్యాండ్‌స్కేప్ ఫస్ట్‌లుక్‌కు హైలెట్‌గా కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రజంట్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఎదురవుతోంది. ఇప్పుడు ఈ ఇబ్బందిని టాలీవుడ్ మన్మథుడు నాగ్ ఎదుర్కొంటున్నారు. ప్రవీణ్ సత్తారు మూవీలో తొలుత కాజల్‌ను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అయితే అనివార్య కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఇలియానా పేరు వినిపించింది. అది కూడా ప్రచారమే అని తేలిపోవడంతో హీరోయిన్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు మేకర్స్. అయితే ఈ ప్రాజెక్ట్‌లో చేయడానికి భారీగా రెమ్యూనరేషన్ అడుగుతూ చుక్కలు చూపిస్తున్నారట హీరోయిన్లు.
తొలుత అమలా పాల్‌ను సంప్రదించగా.. ఆమె భారీగా డిమాండ్ చేసి మేకర్స్‌కు షాక్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. దీంతో ఆమెను కాదని మెహరీన్ కౌర్‌ను అడగ్గా ఈ పంజాబీ ముద్దుగుమ్మ కూడా కోటీ రూపాయలకు వరకు డిమాండ్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ల వైఖరితో నిర్మాతలకు బొమ్మ కనిపిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అమలా పాల్, మెహరీన్‌ల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com