అమల పెరుగుతోంది!
- IndiaGlitz, [Monday,March 14 2016]
కెరీర్లో బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిలైంది అమలాపాల్. నాన్న సినిమాను తెరకెక్కించిన ఎ.ఎల్.విజయ్‌ని పెళ్ళి చేసుకున్న అమలాపాల్ ఇప్పుడు మరలా నటనకు శ్రీకారం చుట్టింది. తమిళంలో ఆమె సూర్య పక్కన నటించిన సినిమా 'మేము' పేరుతో తెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె అమ్మా కనక్కు అనే సినిమాలో నటించనుంది. ఈ సినిమాలో అమలాపాల్ ఏకంగా 13ఏళ్ళ కుమార్తెకు తల్లిగా నటించనుంది. నిజ జీవితంలో అమలాపాల్ ఇంకా తల్లి కాలేదు. కానీ తెరమీద మాత్రం 13ఏళ్ళ పాపకు తల్లిగా నటనను పలికించాల్సి ఉంది. అందుకుగానూ ఆమె పుష్టిగా తయారయ్యే పనుల్లో ఉంది. కాస్త పుష్టిగా, ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతున్న ఇల్లాలి పాత్రలో కనిపించడానికి అమలా ప్రస్తుతం బరువు పెరుగుతోంది.
More News
Mysskin and Ram to start the final act today
Prabhas attends maid's wedding
Pranitha Subhash gushes over Prince
Chennai Box Office Status...