అల్లరి జత కట్టనున్న అమలాపాల్....

  • IndiaGlitz, [Tuesday,November 01 2016]

ఈ త‌రం యంగ్ హీరోస్‌లో కామెడి హీరోగా పేరు సంపాదించుకున్న అల్ల‌రి న‌రేష్ ఈ మ‌ధ్య స‌రైన స‌క్సెస్‌లు లేక స‌త‌మ‌త‌మైపోతున్నాడు. త‌న వంతుగా స‌క్సెస్ కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా అలా ఎలా చిత్రంతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు అనీష్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

మ‌ల‌యాళ సినిమాకు రీమేక్‌గా తెలుగులో రూపొంద‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రైతే బావుంటుంద‌ని అంద‌రూ ఆలోచించి చివ‌ర‌కు అమ‌లాపాల్‌కు ఓటు వేశార‌ట‌. ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో హీరోయిన్‌గా రాణించిన అమ‌లాపాల్ త‌ర్వాత డైరెక్ట‌ర్ ఎ.ఎల్‌.విజ‌య్‌ను పెళ్లి చేసుకుంది..చివ‌ర‌కు గొడ‌వప‌డి విడాకులు వ‌ర‌కు వెళ్లిపోయారు అది వేరే సంగ‌తి అనుకోండి..ఇప్పుడు అమ‌లాపాల్ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ సినిమాను చేస్తుందో లేదో చూడాల్సిందే...