నిర్మాతగా అమలాపాల్
Send us your feedback to audioarticles@vaarta.com
గత ఏడాది రాక్షసన్‌తో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న హీరోయిన్ అమలాపాల్ వైవిధ్యమైన కథా చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆ క్రమంలో ఈ అమ్మడు `కెడవర్` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో అమలా పాల్ ఫారెన్సిక్ సర్జన్ పాత్రలో నటిస్తున్నారు. ``ఫారెన్సిక్ సర్జన్‌గా నటించడం అనేది చాలెంజ్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ వృత్తిలో ఉండేవారు 35-40 సంవత్సరాలు వయసులో ఉంటారు. కాబట్టి పాత్రలో ఓ మెచ్యూరిటీని కనపరచాలి.
అది సాధారణ పాత్రల తరహాలో ఉండదని అర్థమైంది. దాంతో నేను ఓ ప్రముఖ ఫారెన్సిక్ సర్జన్‌ను కలుసుకుని ఆయనతో పాటు కొన్ని కేస్ స్టడీస్‌లో పాల్గొన్నాను`` అన్నారు అమలాపాల్. డైరెక్టర్ అనూప్ పనికర్ కథ నచ్చడంతో సినిమాను నిర్మించడానికి ఒప్పుకున్నారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments