నిర్మాత‌గా అమ‌లాపాల్‌

  • IndiaGlitz, [Tuesday,April 02 2019]

గ‌త ఏడాది రాక్ష‌స‌న్‌తో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న హీరోయిన్ అమ‌లాపాల్ వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. ఆ క్ర‌మంలో ఈ అమ్మ‌డు 'కెడ‌వ‌ర్‌' అనే చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాలో అమ‌లా పాల్ ఫారెన్సిక్ స‌ర్జ‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ''ఫారెన్సిక్ స‌ర్జ‌న్‌గా న‌టించ‌డం అనేది చాలెంజ్‌గా అనిపించింది. ఎందుకంటే ఆ వృత్తిలో ఉండేవారు 35-40 సంవ‌త్స‌రాలు వ‌య‌సులో ఉంటారు. కాబట్టి పాత్ర‌లో ఓ మెచ్యూరిటీని క‌న‌ప‌ర‌చాలి.

అది సాధార‌ణ పాత్ర‌ల త‌ర‌హాలో ఉండ‌ద‌ని అర్థ‌మైంది. దాంతో నేను ఓ ప్ర‌ముఖ‌ ఫారెన్సిక్ స‌ర్జ‌న్‌ను క‌లుసుకుని ఆయ‌న‌తో పాటు కొన్ని కేస్ స్ట‌డీస్‌లో పాల్గొన్నాను'' అన్నారు అమ‌లాపాల్. డైరెక్ట‌ర్ అనూప్ ప‌నిక‌ర్ క‌థ న‌చ్చ‌డంతో సినిమాను నిర్మించ‌డానికి ఒప్పుకున్నారు. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌.