ద‌ర్శ‌కుడిపై అమ‌లాపాల్ లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు

  • IndiaGlitz, [Wednesday,October 24 2018]

న‌టి అమ‌లాపాల్ ద‌ర్శ‌కుడు సుశీ గ‌ణేశ‌న్‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేశారు. ప్రస్తుతం మీ టూ ఉద్య‌మం ఉధృతంగా సాగుతున్న నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు సుశీగ‌ణేశ‌న్‌పై అమ‌లాపాల్ ఆరోప‌ణ‌లు చేయ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. సుశి ద‌ర్శ‌క‌త్వంలో బాబీ సింహ‌తో క‌లిసి అమ‌లాపాల్ 'తిరుట్టుప‌య‌లే 2' అనే చిత్రంలో న‌టించారు.

ఈ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో డ‌బుల్ మీనింగ డైలాగులు మాట్లాడ‌టం.. అన‌వ‌ర‌స‌ర‌మైన ఆఫ‌ర్స్ ఇవ్వడం.. కావాల‌నే తాక‌డం వంటి ప‌నులు చేశార‌ని ఆరోపిస్తూ.. లెట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. అమ‌లాపాల్ మెసేజ్ పోస్ట్ చేసిన కాసేప‌టి త‌ర్వాత సుశీ గ‌ణేశ‌న్‌.. అత‌ని భార్య అమ‌లాపాల్‌కు ఫోన్  చేసి దారుణంగా  తిట్టార‌ట‌.

ఈ విష‌యాన్ని కూడా అమ‌లాపాల్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇంత‌కు ముందు లీలా మ‌ణిమేక‌లై త‌న‌తో కారులో ప్ర‌యాణించే స‌మ‌యంలో సుశీ గ‌ణేశ‌న్ త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్పుడు దీనిపై ద‌ర్శ‌కుడు సుశీ గ‌ణేశ‌న్ ఏమ‌ని స్పందిస్తారో చూడాలి.