ట్విట్టర్లో అమలాపాల్ ‘మ్యాంగోస్’ ట్వీట్.. చుక్కలు చూపిస్తున్న నెటిజన్లు!
Send us your feedback to audioarticles@vaarta.com
అమలాపాల్‌ను టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా పెళ్లికి ముందు వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య స్పీడ్ పెంచింది. ఒక్కోసారి ఈమె చేసిన వ్యాఖ్యలతో జాతీయ మీడియాలో సైతం నిలిచిందంటే అర్థం చేసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి తర్వాత అమలాపాల్‌కు రెక్కలొచ్చాయని చెప్పుకోవచ్చు. సినిమాలు లేకపోయిన సోషల్ మీడియాలో నిత్యం అభిమానులు, నెటిజన్లతో కేరళ కుట్టీ టచ్‌లో ఉంటోంది. రోజూ లాగే ఏదో అప్డేట్ ఇచ్చే ఈ భామ ఈసారి ఆమె చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. అదికాస్త బూతుల వర్షం దాకా వెళ్లింది. అసలేం జరిగింది..? అమలాపాల్ ఏం పోస్ట్ చేసింది..? నెటిజన్లు ఎందుకు బూతులు తిడుతున్నారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఏదో ఊహించుకుని పోస్ట్ పెడితే..!!
అదేదో చెబుతుంటారో.. కొన్ని కొన్నిసార్లు నిజంగానే తమ ప్రమేయం లేకుండానే బలైపోతుంటారని చెబుతుంటారే సేమ్ టూ సేమ్.. పాపం ఈ ముద్దుగుమ్మ ఏదో ఊహించుకుని పోస్ట్ చేసి అడ్డంగా బుక్కయిపోయిందని ఈ ట్వీట్‌ను బట్టి చెప్పుకోవచ్చు. ఇదిగో ఎల్లో కలర్ టాప్.. గ్రే కలర్ స్కర్ట్ వేసుకుని ట్విట్టర్లో అమలాపాల్ అందంగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. అక్కడితే ఆగుంటే సరిపోయేది. అయితే కాస్త మసాలా దట్టించిన ఈ భామ చిన్నపాటి ట్యాగ్ కూడా పెట్టింది. ఇదే పాయింట్‌ను పట్టుకుని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
ట్వీట్ సారాంశం ఇదీ...
"ఈ రోజు నేను హ్యపీ మ్యాంగోని.. నేను ఏది కావాలంటే అది కావొచ్చు’ అంటూ తనను తానే మ్యాంగోతో పోల్చుకుంది. కు నచ్చిన కలర్ ఎల్లో అనే అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టింది. అయితే ఈ ట్వీట్‌కు నెటిజన్లు, పలువురు అభిమానుల నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో చుక్కలు చూపిస్తున్నారు. అమలాపాల్ తనకు ఇష్టమైన రంగు వేసుకుంది సరే.. మరి మ్యాంగో అనే పదాన్ని వాడకుండా ఉంటే సరిపోయేది.. లేదంటే పద్దతిగా డ్రెస్ వేసుకునైనా పోస్ట్ పెట్టాల్సింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే రాయలేని భాషలో అమలాపాల్‌ను తిట్టేశారు.. వల్గర్‌గా కామెంట్స్ చేసేశారు. అయితే పోస్ట్ పెట్టి తప్పుచేశానని భావించిందేమోగానీ పాపం.. కనీసం రిప్లై.. రియాక్షన్ గానీ అమలాపాల్ నుంచి రాలేదు.
They told me I can be whatever I want to be, today I'm a happy mango. ??#happyvibes #gypsysoul #yellove #feelingfine pic.twitter.com/ic9yxR1U3H
— Amala Paul ⭐️ (@Amala_ams) May 3, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com