రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్... ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
కేరళ ముద్దుగుమ్మ అమలాపాల్ తన ప్రియుడు, సింగర్ భవ్నీందర్ అడైను వివాహమాడింది. గత కొన్ని రోజుల ముందు నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను చూసిన నెటిజన్స్ వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నారు. అయితే అమలాపాల్ భవ్నీందర్ తన ప్రేమికుడని, తనని పెళ్లి చేసుకోబోతున్నట్లు కానీ చెప్పలేదు. అయితే ఇద్దరి మధ్య ఫొటోల్లో కనపడుతున్న ఇన్‌టిమసీని బట్టి ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ సాగుతుందని అనుకున్నారు. అందుకు తగినట్లే అమలాలపాల్ గత చిత్రం ఆమె విడుదలకు ముందు భవ్నేందర్ అమలాపాల్‌ను చూసి గర్వపడుతున్నానంటూ సోషల్‌మీడియాలో మెసేజ్‌ను పోస్ట్ చేశారు. అయితే ఏం చేసినా ఇప్పటి వరకు ఉహలుగా మాత్రమే మిగిలి పోయాయి. నెటిజన్స్ ఊహలను వీరిద్దరూ నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు.
ఇంతకు ముందు అమలాపాల్ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. గత ఏడాది విజయ్ ఓ లేడీ డాక్టర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ డైరెక్టర్ విజయ్ మాత్రం నోరు మెదపలేదు. ఇప్పుడు అమలాపాల్ పెళ్లి చేసుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com