అమలా ముచ్చట తీరింది
Send us your feedback to audioarticles@vaarta.com
కలువ రేకుల్లాంటి కళ్లతో ఇట్టే ఆకట్టే రూపం అమలా పాల్ది. హీరోయిన్గా బిజీగా ఉన్న టైంలోనే.. డైరెక్టర్ విజయ్ ని పెళ్లాడింది ఈ మలయాళ కుట్టి. పెళ్లి తరువాత అమలా.. ఇక సినిమాలు చేయదేమో అనుకుంటున్న తరుణంలో సూర్య పక్కన 'పసంగ 2'లో ఛాన్స్ కొట్టేసింది. ఇదే సినిమా తెలుగులో 'మేము'గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూర్య పక్కన చేయడం ఓ కలలాగా ఉందని అమలా చెప్పుకొచ్చింది.
విజయ్, విక్రమ్లాంటి స్టార్ హీరోల పక్కన నటించిన తనకి.. సూర్య పక్కన నటించాలన్న కోరిక ఉండేదని.. అయితే అనూహ్యంగా పెళ్లి అవడంతో.. ఇక ఆ ఛాన్స్ రాదనుకుందట అమలా. అయితే 'పసంగ 2'లో గెస్ట్ రోల్ లో కనిపించనున్న సూర్యకి జోడీగా నటించే అవకాశం రావడంతో అమలా ఆనందంగా ఒప్పుకుందట. మొత్తానికి సూర్య సరసన నటించాలన్న అమలా ముచ్చట 'మేము'తో తీరిందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com