కుక్కల పట్ల అమానుషంగా బ్లూక్రాస్.. అసత్యం అంటూ ఖండించిన అమల
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని అమల జంతు ప్రేమికురాలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఆమె జంతు హింసకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం అమల బ్లూ క్రాస్ కు చైర్ పర్సన్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లో బ్లూ క్రాస్ పై గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ చదవండి: రాజమౌళి రిలీజ్ చేసిన రాఘవేంద్ర రావు ఫస్ట్ లుక్ వీడియో
అందుకు కారణం సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి చేస్తున్న ప్రకటనలే. బ్లూ క్రాస్ సంస్థ హైదరాబాద్ లో వీధి కుక్కలని అన్యాయంగా బంధించి వాటికీ పిల్లలు పుట్టకుండా ఏబీసీ (ఎనిమల్ బర్త్ కంట్రోల్) సర్జరీ చేయిస్తున్నారని.. అవి పూర్తిగా కోలుకోకుండానే అమానుషంగా రోడ్లపై వదిలేస్తున్నారని ఆరోపించాడు.
ఈ వార్త వైరల్ కావడంతో బ్లూ క్రాస్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. శునకాల పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో బ్లూ క్రాస్ చైర్మన్ అమల అక్కినేని స్వయంగా ఈ దుష్ప్రచారాన్ని ఖండించింది. ఈ వార్తల పట్ల వివరణ ఇచ్చింది.
బ్లూ క్రాస్ ఎప్పుడూ జంతువుల పట్ల అమానుషంగా ప్రవర్తించదు అని ఆమె లేఖలో పేర్కొన్నారు. జి హెచ్ ఎం సి సూచనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటున్నట్లు అమల తెలిపారు. ఏబీసీ సర్జరీ చేసిన తర్వాత వెంటనే వాటిని వదిలేయడం లేదు. కొన్ని రోజులపాటు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచుతున్నామని, అవి కోలుకున్న తర్వాతే వాటి స్వస్థలాల్లో వదిలి పెడుతున్నాం అని అమల అన్నారు.
దాదాపు 2 వేలకు పైగా శునకాలని బంధించి ఆపరేషన్ చేసి అవి కోలుకోకుండానే రోడ్లపై వదిలేశారని ఆరోపించాడు. అధికారుల ఒత్తిడి, టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఇలా విచ్చల విడిగా శునకాలని బంధిస్తున్నట్లు నెటిజన్ ఆరోపించాడు. ఇదంతా దుష్ప్రచారం అని అమల కొట్టిపారేశారు.
Official statement by Our Chair Person on the Misleading Accusations. pic.twitter.com/xvmtobefUn
— Blue Cross Hyderabad (@bluecrosshyd) July 29, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments