సమంత వంట గురించి అమల ఏమన్నారంటే..?
- IndiaGlitz, [Tuesday,April 14 2020]
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత అక్కినేని ఒకరు. స్టార్ హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే అక్కినేని నాగచైతన్యతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. నటన పరంగా అగ్ర తారగా ఉన్న సమంత ఇంట్లో వంటి చేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమంత వంట చేయలేదని చెప్పిన అమల అక్కినేని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘అక్కినేని కుటుంబంలో నాగార్జున బాగా వంట చేస్తారని అలాంటప్పుడు మరొకరు వంట చేయడమెందుకు?’ అని చెప్పిన అమల నాగార్జున చాలా బాగా వంట చేస్తారని తెలిపారు.
నాగార్జునే కాదు నాగచైతన్యకు కూడా వంటి చేయడం బాగా వచ్చు. ఈ విషయాన్ని సమంత చాలా సందర్భాల్లో చెప్పారు. నాగచైతన్య వంట చేసే ఫొటోలను సమంత షేర్ చేశారు. క్వారంటైన్ టైమ్‌లోనూ చైతన్య మంచి రుచికరమైన వంటను వండాడంటూ సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం నాగచైతన్య ‘లవ్‌స్టోరి’ సినిమాతో బిజీగా ఉంటే.. సమంత రెండు తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది సమంత ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2 వెబ్‌సిరీస్‌తోనూ ప్రేక్షకులను పలకరించనున్నారు.