సాయిధరమ్ తేజ్ తో పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే - ప్రసన్న
Send us your feedback to audioarticles@vaarta.com
`జవాన్` సినిమాలో కేశవ అనే క్యారెక్టర్ కోసం రవిగారు కొత్త నటుడు కావాలని వెతుకుతున్నప్పుడు రచయితలు గోపీమోహన్, కోన వెంకట్లు నా పేరును రవికి చెప్పారు. దాంతో ఆయన నన్ను చెన్నైలో కలిశారు. అరగంట కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. వెంటనే సినిమా చేయడానికి అంగీకరించాను. నేను `జవాన్` సినిమాలో నటించడానికి ప్రధాన కారణం గోపీమోహన్, కోనవెంకట్గారేనని అన్నారు నటుడు ప్రసన్న.
రీసెంట్గా విడుదలైన `జవాన్` చిత్రంలో ప్రసన్న విలన్‌గా నటించారు. సాయిధరమ్ తేజ్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం `జవాన్`. దిల్‌రాజు సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో కృష్ణ సినిమాను నిర్మించారు. సినిమా డిసెంబర్ 1న విడుదలైంది.
ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ - ``ఇంత మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. మరో పక్క నా కల నిజమైనట్లు ఉంది. మంచి టీంతో కలిసి పనిచేశాను. ఈ సందర్భంగా తెలుగులో నాకు ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ రవిగారికి, సాయిధరమ్ తేజ్‌గారికి, దిల్‌రాజుగారికి థాంక్స్. స్ట్రాంగ్ విలన్ రోల్‌నే ఇవ్వడమే కాకుండా సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉండే పాత్ర చేసేందుకు అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. . సినిమాలో నా క్యారెక్టర్‌ను `ధృవ` చిత్రంలో అరవింద్ స్వామిగారు పోషించిన సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్‌తో పోల్చడం చాలా గొప్ప విషయంగా ఫీలవుతున్నాను. తెలుగు ప్రేక్షకులు మంచి నటుడు ఎవరైనా, భాషతో సంబంధం లేకుండా అభిమానిస్తారు. అలాగే నన్ను కూడా ఆదరిస్తున్నారు. నెగటివ్ రోల్ అయినా చాలా బాగా నచ్చడంతో చేశాను. నేను, బాబీ సింహ, అమలాపాల్ నటించిన `తిరుట్టుపయలే -2` చిత్రం నాకు 25వ సినిమా. ఈ చిత్రం కూడా ఈ గురువారమే తమిళంలో విడుదలవగా, తెలుగులో `జవాన్` విడుదలైంది. రెండు సినిమాల్లో నేను విలన్‌గానే నటించాను. నా పాత్రలకు చాలా మంచి ఫీడ్ బ్యాక్ వస్తుంది. నేను తెలుగులో నటించాలని కోరుకునే వ్యక్తుల్లో స్నేహ ఒకరు. తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతో ఇష్టం, గౌరవం. అదే నమ్మకంతో నాగార్జునగారు హీరోగా, నిర్మాతగా చేసిన `భాయ్` చిత్రంలో నాకు అవకాశం రావడంతో ఏ మాత్రం ఆలోచించకుండా నటించమని చెప్పింది. తన మాటతో అసలు సినిమా కథేంటో కూడా తెలుసుకోకుండా నటించాను. అలాగే `జవాన్`లో నటించడానికి అంగీకరించినప్పుడు కూడా తనెంతో హ్యాపీగా ఫీలైంది. డిటెక్టివ్ సినిమాలో కూడా మంచి పాత్రలో నటించాను. ఆ సినిమా తెలుగులో కూడా విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుందని తెలిసింది. మిస్కిన్ వంటి డైరెక్టర్‌తో పనిచేయడం మరచిపోలేని అనుభూతి. ఇప్పుడు ఆయనతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. డిటెక్టివ్ 2 ఇంకా ప్లాన్ చేయలేదు. విశాల్‌తో పాటు నాకు కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తి కాగానే సీక్వెల్ ఉండొచ్చు. రెండు మూడు సీక్వెల్స్ చేద్దామని ప్లాన్ అయితే ఉంది కానీ ఎప్పుడు జరుగుతుందో ఇప్పుడు చెప్పలేను. ఇక జవాన్ విషయానికి వస్తే, సాయిధరమ్ తేజ్ చాలా సింపుల్, ఫ్రెండ్లీ కోస్టార్. నాకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. మనసులో కాస్త ఇబ్బందిగానే ఫీలయ్యాను. కానీ సాయిధరమ్‌ను కలవగానే ఆ ఇబ్బంది పోయినట్లపించింది. కారణం..అతను నాతో తమిళంలో మాట్లాడారు. అలాగే, ఎంతో కంఫర్ట్ ఇచ్చారు. డైలాగ్స్ విషయంలో ఎంతో సపోర్ట్ చేశారు. ఓ అన్నయ్య నన్ను ట్రీట్ చేశాడు. తనతో ఎప్పుడైనా కలిసి పనిచేయడానికి నేను సిద్ధమే. తమిళంలో ఓ పోలీస్ సినిమాలో నటించబోతున్నాను. అది జనవరిలో స్టార్ట్ అవుతుంది`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments