చరణ్ సరసన కూడా...
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్‌చరణ్ ధృవ ఈ డిసెంబర్ 9న థియేటర్స్‌లో రానుంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్‌చరణ్ తన నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్నాడనే సంగతి తెలిసిందే. అయితే తండ్రి, మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` సినిమా తర్వాతనే ఈ సినిమా ప్రారంభమవుతుందని చరణ్ కన్ఫర్మ్ చేసేశాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష్‌న్ పనులు స్టార్ట్ అయ్యాయట. డిఫరెంట్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందించనున్నారు.
ఈ సినిమాలో చరణ్ సరసన నటించబోయే ముద్దుగుమ్మ ఎవరనే తెలియడం లేదు. అయితే కొన్ని రోజుల క్రితం రాశిఖన్నా పేరు వినపడింది. అయితే తాజా సమాచారం ప్రకారం చరణ్ సరసన మలయాళీ సొగసరి కీర్తి సురేష్ నటించనుందట. ప్రస్తుతం కీర్తి సురేష్ నానితో నేను లోకల్ సినిమాలో నటిస్తుంది. పవన్‌కల్యాణ్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో హీరోయిన్గా నటించనుంది. మహేష్ పక్కన హీరోయిన్గా కూడా కీర్తి పేరు పరిశీలనలో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com