ఆ సినిమా నాకు బైబిల్ - మహేష్
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్, మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం `శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యమంచిలి రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 7న వరల్డ్ వైడ్‌గా విడుదవుతోంది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్‌తో ఇంటర్వ్యూ....
టైటిల్ జస్టిఫికేషన్ ...
యూనివర్సల్ కాన్సెప్ట్ తో శ్రీమంతుడు` రూపొందింది. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇప్పటి వరకు ఇలాంటి రోల్ చేయలేదు. సినిమా స్టార్టింగ్ లో ముందు ఈ టైటిల్ ను అనుకోలేదు. సినిమా చివరికి వచ్చేసరికి ఈ టైటిల్ అయితేనే కరెక్ట్ అని భావించాం. సినిమా చూస్తే ఆ విషయం తెలుస్తుంది. దర్శకుడు కొరటాల శివ కథ చెప్పగానే ఇన్స్టెంట్గా నచ్చింది. స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది. ఎమోషన్స్ బాగా క్యారీ అవుతాయి.
నిర్మాతగా మారడానికి ....
ఈ సినిమాకే కాదు గతంలో బ్రదర్ రమేష్, సిస్టర్ మంజులు కో ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు. ఈ సినిమాకి నా పేరు కనపడుతుందంతే.
అనుభవమున్న నిర్మాతల్లా చేశారు...
నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) ఇంతకు ముందు యు.ఎస్ లో నా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. వారిని రెండు, మూడు సార్లు కూడా కలిశాను. వారికి సినిమాపై ఉన్న ఫ్యాషన్ తో శ్రీమంతుడుతో నిర్మాతలు మారాను. తొలి సినిమానే అయినప్పటికీ అనుభమున్న వారిలా సినిమాని నిర్మించారు. వారికి ఆల్ ది బెస్ట్.
మంచి కంటెంట్ విత్ ఎమోషన్స్...
గతంలో రచయితన కొరటా శివ ఎన్నో సూపర్‌హిట్ సినిమాకు రైటర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమా విషయానికి వస్తే నా ఆయన కథను నడిపిన తీరు సూపర్. మెసేజ్ ను కూడా కమర్షియల్ యాంగిల్ లో చక్కగా తీసుకెళ్లారు. ఇంతకు ముందు చెప్పినట్టు స్ట్రాంగ్ కంటెంట్, ఎమోషన్స్ ఉన్న సినిమా.
శృతిహాసన్‌తో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్....
శృతిహాసన్ ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మర్. మంచి డ్యాన్సర్, సింగర్. తనతో ఆగడు సినిమాకి ఒక సాంగ్ లో చేశాను. శ్రీమంతుడులో హీరోయిన్ గా తను నటించింది. చక్కగా నటించింది.
బాలీవుడ్ ప్రవేశం....
నిజం చెప్పాలంటే టైమ్ లేదండి. ఇప్పుడు తెలుగులోనే బిజీగా ఉన్నాను. చాలా మంది ఏడాదికి రెండు సినిమాలు చేయమని అడుగుతున్నా కుదరడం లేదు. ఒకవేళ నేను బాలీవుడ్ సినిమా కూడా చేయాలని ప్రయత్నిస్తే తెలుగులో నా సినిమా రావడానికి మూడేళ్లు టైమ్ పడుతుంది.
తమిళంలో ఎంట్రీ....
ఇదొక యూనివర్సల్ పాయింట్ అదే ఈ సినిమాని తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి మమల్ని ఇన్ స్పైర్ చేసింది. షూటింగ్ సమయంలో సినిమాటోగ్రాఫర్ మది ఈ సినిమా కాన్సెప్ట్ బావుందని తమిళంలోకూడా చేస్తే బావుంటుందని అనడంతో నిర్మాతలు వర్కవుట్ చేసి సినిమాని తమిళంలో విడుదల చేస్తున్నారు. అయితే నేను తమిళం బాగా మాట్లాడగలను. అయినా డబ్బింగ్ చెప్పే టైమ్ లేదు. అందుకనే తమిళ్లో నేను డబ్బింగ్ చెప్పలేదు.
దర్శకత్వం ఆలోచన....
అలాంటి ఆలోచనే లేదు. దర్శకత్వం అనేది చాలా డిఫరెంట్ టాస్క్. ఒక నటుడిగానే ఆనందంగా ఉన్నాను.
చెడగొట్టడం ఇష్టం లేదు...
అల్లూరి సీతారామరాజు` నాకు బైబిల్ లాంటిది. ఇప్పటికే ఆ సినిమాని వందసార్లు సినిమాని చూసుంటా. అదొక క్లాసిక్ మూవీ. అటువంటి సినిమాను రీమేక్ చేసి చెడగొట్టడం నాకు ఇష్టం లేదు.
డ్రీమ్ రోల్..
నేను చేసే ప్రతి సినిమాలో నా రోల్ డ్రీమ్ రోలే.
ఎక్స్ పెరిమెంట్ రోల్స్..
ప్రారంభం నుండి నేను ఎక్స్ పెరిమెంట్ రోల్స్ చేస్తూనే ఉన్నాను. టక్కరి దొంగ, నాని వంటి సినిమాలు అందుకు ఉదాహరణలు. అయితే వర్కవుట్ కాలేదు.
రాజమౌళి, వినాయక్‌తో సినిమాలు చేస్తున్నారా?
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కుదిరితే తప్పకుండా తెలియజేస్తాను.
నెక్స్ ట్ మూవీ?
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చేస్తున్నాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout