నవంబ‌ర్ 24న 'అల్లుడు సింగం'

  • IndiaGlitz, [Monday,November 06 2017]

షాపింగ్ మాల్‌, జ‌ర్నీ, గీతాంజ‌లి, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, డిక్టేట‌ర్ వంటి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన తెలుగు, త‌మిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అంజ‌లి రెండు షేడ్స్‌లో న‌టించిన చిత్రం 'అల్లుడు సింగం'. స‌త్య‌దేవ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై విమ‌ల్‌, అంజ‌లి జంట‌గా రూపొందుతోన్న మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని రావిపాటి స‌త్య‌నారాయ‌ణ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత రావిపాటి స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - "పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతో్న్న‌ 'అల్లుడు సింగం' సినిమాలో సరికొత్త గ్లామ‌ర్ లుక్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రే సినిమాలో చేయ‌ని విధంగా లాయ‌ర్‌, పొలిటీషియ‌న్‌గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డనుంది. ల‌వ్‌, యాక్ష‌న్ స‌హా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి న‌ట‌న‌, క‌మెడియ‌న్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ‌గారి సినిమా టైటిల్స్‌తో 'వ‌చ్చాడు వ‌చ్చాడు బొబ్బిలిసింహం' పాట‌ను ప్ర‌త్యేకంగా రాయించాం. ప్ర‌స్తుతం సినిమా అన్నీ కార్యక్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ న‌వంబ‌ర్ 24న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది" అన్నారు.

ఈ చిత్రానికి సంగీతంః ఎన్‌.ఆర్‌.ర‌ఘునంద‌న్‌, మాట‌లుః వెంక‌ట్‌, నిర్మాతః రావిపాటి స‌త్య‌నారాయ‌ణ‌, ద‌ర్శ‌కుడుః రాజ‌శేఖ‌ర్‌.

More News

నవంబర్ 30న రిలీజ్ అవుతోన్న'ఇంద్రసేన'

వైవిధ్యమైన సినిమాలతో, వరుస కమర్షియల్ సక్సెస్ లతో తనకంటూ ఓ మార్క్ ను సృష్టించుకున్న హీరో విజయ్ ఆంటోని తాజాగా నటిస్తోన్న చిత్రం `ఇంద్రసేన`.

ఐశ్వర్య షూటింగ్ లో ప్రమాదం...

ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం ఫన్నెఖాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరిగింది.

శివాజీ రాజా ముఖ్య పాత్రలో 'అమ్మాయిలంతే..అదో టైపు'

అమ్మాయిల లొని  ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను,  తండ్రి తనయల రిలేషన్ హైలెట్ చెస్తూ దర్శ కుడు కృష్ణమ్ రూపొందిస్తొన్న చిత్రం 'అమ్మాయిలంతే ..అదోటైపు'.

నవంబ‌ర్ 17న 'దేవిశ్రీ ప్ర‌సాద్‌' విడుద‌ల‌

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో,  ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న‌ చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధ‌న‌రాజ్‌, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి

భరత్ ఆర్ట్ ప్రొడక్షన్స్..  ప్రొడక్షన్ నెంబర్ వన్ గా బండారు దానయ్య కవి దర్శకత్వంలో కదిరి శేఖర్ బాబు నిర్మిస్తున్న చిత్రం 'డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి'.