నవంబర్ 24న 'అల్లుడు సింగం'
Send us your feedback to audioarticles@vaarta.com
షాపింగ్ మాల్, జర్నీ, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన తెలుగు, తమిళ సినీ రంగాల్లో హీరోయిన్గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అంజలి రెండు షేడ్స్‌లో నటించిన చిత్రం 'అల్లుడు సింగం'. సత్యదేవ పిక్చర్స్ బ్యానర్‌పై విమల్, అంజలి జంటగా రూపొందుతోన్న మాస్ ఎంటర్టైనర్ని రావిపాటి సత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా...
నిర్మాత రావిపాటి సత్యనారాయణ మాట్లాడుతూ - "పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లవ్‌స్టోరీగా రూపొందుతో్న్న 'అల్లుడు సింగం' సినిమాలో సరికొత్త గ్లామర్ లుక్‌తో ఇప్పటి వరకు మరే సినిమాలో చేయని విధంగా లాయర్, పొలిటీషియన్‌గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనపడనుంది. లవ్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాధారవి నటన, కమెడియన్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణగారి సినిమా టైటిల్స్‌తో 'వచ్చాడు వచ్చాడు బొబ్బిలిసింహం' పాటను ప్రత్యేకంగా రాయించాం. ప్రస్తుతం సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నవంబర్ 24న విడుదలకు సిద్ధమైంది" అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః ఎన్.ఆర్.రఘునందన్, మాటలుః వెంకట్, నిర్మాతః రావిపాటి సత్యనారాయణ, దర్శకుడుః రాజశేఖర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com