'అల్లుడు శీను' మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా?

  • IndiaGlitz, [Tuesday,May 29 2018]

ప్ర‌ముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు అనే ట్యాగ్ లైన్‌తో ‘అల్లుడు శీను’ సినిమా ద్వారా క‌థానాయ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసల సైతం అందుకున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో చెప్పుకోద‌గ్గ‌ విజయం సాధించింది. జూలై 25, 2014న విడుదలైన ఈ సినిమాతో తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు శ్రీనివాస్.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో భాగంగా విజువల్ ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం జూలై సెకెండ్ హాఫ్‌ అంటే జూలై 20న విడుదల కానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కాగా.. ‘అల్లుడు శీను’ విడుద‌లైన జూలై సెకెండ్ హాఫ్‌లోనే.. మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ‘సాక్ష్యం’ కూడా రిలీజ్ కానుండడంతో.. శ్రీనివాస్ మరోసారి ‘అల్లుడు శీను’ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.