అల్లు శిరీష్ విలన్ నాగచైతన్య చిత్రంలోనూ..
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు కుమారుడిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టారు దాసరి అరుణ్ కుమార్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేసినా...ఇవేవీ కూడా అరుణ్ కుమార్ కెరీర్‌కు ప్లస్ కాలేదు. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకి దూరంగానే వున్నారు. తండ్రి మరణం తరువాత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్ళీ సినిమాల వైపు దృష్టి సారిస్తున్నారు అరుణ్.
ఇటీవలే వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఒక్క క్షణం' సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో దర్శనమిచ్చారాయన. అంతేగాకుండా, ఇప్పుడు నాగచైతన్య, మారుతి కలయికలో తెరకెక్కుతున్న 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో కూడా ప్రతినాయకుడి ఛాయలు వున్న పాత్రకి అరుణ్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి నిడివి గల పాత్ర కాకపోయినప్పటికీ.. ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇదని తెలిసింది.
అంతేగాకుండా...మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రంలో కూడా అరుణ్ కుమార్ ఒక పాత్ర చేయనున్నట్టు టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్. వరుసగా అవకాశాలు వస్తుండడంతో.. పూర్తి స్థాయి నటుడిగా కొనసాగేందుకు అరుణ్ కుమార్ ఆసక్తి చూపిస్తున్నారని అతని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com