డిసెంబ‌ర్ 28న విడుద‌ల కానున్న అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, 'ఒక్క క్షణం'

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంట‌గా, డిమానిటైజేష‌ల్ లో కూడా బ్లాక్‌బ‌స్టర్ గా నిలిచిన‌ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో.... సినిమా నిర్మించడంలో ఎక్క‌డా ఎలాంటి కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ కోస‌మే ప‌రిత‌పించే లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ పై.... , సినిమా అంటే ప్యాష‌న్ తో మంచి చిత్రాలు నిర్మించే చక్రి చిగురుపాటి నిర్మాత‌గా నిర్మించిన చిత్రం ఒక్క క్షణం.

ప్ర‌ముఖ న‌టుడు శ్రీనివాస్ అవ‌స‌రాల‌, సీర‌త్ క‌పూర్ జంట‌గా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల‌ విడుదల చేసిన టీజ‌ర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావ‌ట‌మే కాకుండా జెన్యూన్ ఆడియ‌న్స్ నుండి దాదాపు 2 మిలియ‌న్స్ వ్యూస్ రావ‌టం ఈ టీజ‌ర్ స్టామినాకి నిద‌ర్శ‌నం. సోషల్ మీడియాలో ఈ టీజ‌ర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

అంతేకాదు అనూహ్యంగా ఇత‌ర రాష్ట్ర‌ల్లో కూడా యూట్యూబ్ ట్రెండింగ్ అవ్వ‌డం అశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈనెల 8న .. సోమెని సోమెని త‌ల‌పులే... అని మెద‌ల‌య్యే సాంగ్ విడ‌ుదల చేశారు... ఈ సాంగ్ ని మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వరపరిచారు. విడ‌ుదల చేసిన త‌క్కువ టైంలో ఈ సాంగ్ ఆక‌ట్టుకోవ‌డం చిత్ర యూనిట్ కి మాంచి బూస్ట్ ఇచ్చింది. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి డిసెంబ‌ర్ 28న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు శిరీష్ హీరోగా, సుర‌భి హీరోయిన్ గా మా బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం ఒక్క క్షణం. మేము విడుదల చేసిన టైటిల్ పోస్టర్ నుంచి టీజ‌ర్‌, సాంగ్ వ‌ర‌కూ అన్నింటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం రెండు ప్యారలల్ లైఫ్ ల‌తో ముడిప‌డి వుంటుంది. ఒక‌రి ప్రెజెంట్ మ‌రొక‌రి ఫ్యూచ‌ర్ అనే కాన్సెప్ట్ తో రూపొందించాం. వినూత్న‌శైలి ని వినోదాత్మ‌కంగా తీయ‌గ‌ల ద‌ర్శ‌కుడు వి ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని అద్బుతంగా తెర‌కెక్కించారు. ఇటీవ‌ల విడుదల చేసిన టీజ‌ర్ దీనికి పెర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవ‌చ్చు.

ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కులంద‌రూ ఈ విష‌యం పై డిస్క‌స్ చేసుకుంటున్నారు.. నాలాగా నా లైఫ్ స్టైల్ తో వెరొక‌రి లైఫ్ ర‌న్ అవుతుందా... అంటూ అంద‌ర్ని ఓ ఆలోచ‌న‌లో పడేశారు మా ద‌ర్శ‌కుడు ఆనంద్‌. ఆత్మ కి వెయిట్ వుంటుందా అనేది ఎంత స‌న్సెష‌న్ అయ్యిందో ఇప్ప‌డు ప్యారలల్ లైఫ్ మీద ఇంతలా డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌డం మా చిత్రం మెద‌టి విజ‌యం గా భావిస్తున్నాం. మొద‌టి రీల్ నుండి ప్ర‌తి ఓక్క సీన్ ప్రేక్ష‌కుల్ని థ్రిల్ చేస్తుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా అనే చిత్రాన్ని మించి ద‌ర్శ‌కుడు చిత్రీక‌రించారు.

క‌థ‌ని బ‌లంగా న‌మ్మి తీసిన చిత్రం మా ఓక్క క్ష‌ణం. రెండు జంట‌లు అల్లు శిరీష్, సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, సీర‌త్ క‌పూర్ జీవితాల్లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు త‌ప్ప‌కుండా ఆశ్య‌ర్యానికి గురిచేస్తాయి. ఒక‌ర్ని మించి ఒక‌రు న‌టించారు. మ‌ణిశ‌ర్మ గారి రీ-రికార్డింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ప్ర‌స్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.

శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, శ్యామ్ కె నాయుడు వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు వి.ఐ ఆనంద్ మాట్లాడుతూ.. గత సంవత్సరం న‌వంబ‌ర్ 18న ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి చిత్రాన్ని డిమానిటైజేష‌న్ టైం లో విడుద‌ల చేశాము. కంటెంట్ వుంటే ఎన్ని ఇబ్బందులు ప‌డినా మంచి చిత్రాల‌కి మా ఆద‌ర‌ణ వుంటుందని తెలుగు ప్రేక్ష‌కులు నిరూపించారు. మ‌రొక్కసారి వారంద‌రికి నా పాదాభివంద‌నాలు.

తెలుగు ప్రేక్ష‌కులు ఇచ్చిన ధైర్యంతోనే మ‌రొక్క‌సారి స్ట్రాంగ్ కంటెంట్ తో ఒక్క‌ క్ష‌ణం చిత్రాన్ని తీసుకువ‌స్తున్నాం. ప్యారలల్ లైఫ్ లో జరిగే సంఘ‌ట‌న‌ల ఆధారంగా తీసుకుని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి, ఎక్క‌డా ఆలోచ‌న‌కి తావులేని క‌థ‌నం తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాము. ఒక‌రి ప్రెజెంట్ మ‌రొక‌రి ఫ్యూచ‌ర్ గా వారి లైఫ్ లో జ‌రిగే ప్ర‌తి సంఘ‌ట‌న‌ని చాలా వైవిధ్యంగా తీసాము. హీరో అల్లు శిరీష్‌, సుర‌భి పాత్ర‌లో ఇమిడిపోయారు.

అలాగే మ‌రో జంట గా శ్రీనివాస్ అవ‌స‌రాల‌, సీర‌త్ క‌పూర్ న‌టించారు. ఈ న‌లుగురి మ‌ధ్య‌లో వీరి జీవితాల్లో ఏం జ‌రిగింది అనేది డిసెంబ‌ర్ 28న రివీల్ చేస్తాం. నన్ను , నాక‌థ‌ని న‌మ్మి నిర్మాత చ‌క్కి చిగురుపాటి హై బ‌డ్జెట్ లో అంటే ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. అన్నారు.

More News

ఫిబ్రవరి 9న విడుదలవుతున్న నిఖిల్ 'కిర్రాక్ పార్టీ'

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా "కిరిక్ పార్టీ"ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో 'కిర్రాక్ పార్టీ'గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న 'ఇ ఈ'

నీరజ్‌ శ్యామ్‌, నైరా షా జంటగా నటించిన చిత్రం 'ఇ ఈ'. రామ్ గణపతిరావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవబాల క్రియేషన్స్ పతాకంపై లక్ష్మమ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ చేతన్ టీఆర్ స్వరాలందించారు.

'రంగ‌స్థ‌లం' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై రూపొందిన భారీ చిత్రం 'రంగ‌స్థ‌లం'. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌) నిర్మాత‌లు ఈ ప్రెస్టీజియ‌స్ చిత్రాన్ని నిర్మించారు.

ప్రభాస్ కి పాడాలని ఉందట‌

బాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ అర్మాన్ మాలిక్. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడారు.

'హ‌లో'.. మెరిసే మెరిసే పాట విశ్లేష‌ణ‌

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హలో'. అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్ జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు.