చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటున్న అల్లు హీరో
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియా పరిధి పెరిగింది ప్రమోషన్స్ పరంగా సినిమాలకు బాగానే పనికొస్తున్నాయి. అయితే దీనికి రివర్స్ కూడా జరుగుతుంది. కొందరు సోషల్ మీడియాను తప్పుగా వాడుకుంటున్నారు. తమకు నచ్చని హీరోను ట్రోల్ చేయడానికి సోషల్ మీడియాను విరివిగా వాడుకుంటున్నారు. అలాంటి ఓ ఆకతాయి.. అల్లు శిరీష్ పోస్ట్ చేసినట్లుగా తారక్‌ను అవమానిస్తున్నట్లుండే ఓ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. దీనిపై అల్లు శిరీష్ వెంటనే స్పందించాడు. తనపై ఇలా దుష్ప్రచారం చేస్తే సహించనని చట్టపరమైన చర్యలు తీసుకుంటానని శిరీష్ ట్వీట్ చేశాడు. అల్లు శిరీష్ తనదైన స్టైల్లో ఘాటుగా రిప్లయ్ ఇవ్వడంతో రాంగ్ పోస్ట్ చేసిన సదరు వ్యక్తి ట్విట్టర్ నుండి వెళ్లిపోయాడట.
మరో పక్క అల్లు శిరీష్ తాను `అల వైకుంఠపురములో` ప్రీ రిలీజ్‌కు వెళుతున్నానని అన్నాడు. ఆసక్తికరమైన విషయేమమేంటే సరైనోడు...2016 లో విడుదలైంది. ఆ ప్రీరిలీజ్ వేడుక తర్వాత శిరీష్ అల్లు అర్జున్ ప్రీ రిలీజ్‌కి హాజరు కాలేదు. నాలుగేళ్ల తర్వాతే బన్నీ ఫంక్షన్‌కు హాజరు కావడం ఎగ్జయిటింగ్‌గా ఉందని శిరీష్ అన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments