వాళ్లే నిజమైన హీరోలు - అల్లు శిరీష్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం 1971. ఈ చిత్రం ద్వారా అల్లు శిరీష్ మల్లువుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇండో - పాక్ వార్ నేపథ్యంతో రూపొందే ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్నిమేజర్ రవి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం కోసం రాజస్ధాన్, పంజాబ్ బోర్డర్స్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ ట్విట్టర్ లో స్పందిస్తూ....ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షూటింగ్ లో పాల్గొనడం వలన ఆర్మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని కాపాడుతున్న సైనికులు నిజమైన హీరోలు అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసాడు అల్లు శిరీష్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com