గీతా ఆర్ట్స్ ర‌హస్యాన్ని బ‌య‌ట‌పెట్టిన అల్లు శిరీష్..!

  • IndiaGlitz, [Thursday,August 25 2016]

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. సోష‌ల్ మీడియాలో బాగా ఏక్టివ్ గా ఉండే అల్లు శిరీష్ కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో...ప్ర‌పంచానికి భ‌గ‌వ‌ద్గీత అందించిన శ్రీకృష్ణకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను.

నీప‌ని నువ్వు చేయి ఫ‌లితం గురించి ఆలోచించ‌కు అనే సందేశాన్ని భ‌గ‌వ‌ద్గీత అందించింది. భ‌గ‌వ‌ద్గీత ద్వారా మా నాన్న గారు ఎంతో స్పూర్తి పొందారు. అందుక‌నే మా నిర్మాణ సంస్థ‌కు గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టారు. కొంత మంది తెలియ‌క గీతా అంటే మా అమ్మ పేరు అనుకుంటారు. మా అమ్మ పేరు నిర్మ‌ల అంటూ గీత ఆర్ట్స్ వెన‌కున్న ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టాడు అల్లు శిరీష్..! అది సంగ‌తి..!