Tamil »
Cinema News »
అల్లు శిరీష్ , వి.ఐ.ఆనంద్ , చక్రి చిగురుపాటి కాంబినేషన్ లో నూతన చిత్రం ప్రారంభం
అల్లు శిరీష్ , వి.ఐ.ఆనంద్ , చక్రి చిగురుపాటి కాంబినేషన్ లో నూతన చిత్రం ప్రారంభం
Sunday, April 9, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్ హీరోగా, సురభి, సీరత్ కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో విఐ ఆనంద్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, నిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విఛాన్ చేశారు. చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.
శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం కావడం, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మణిశర్మ, అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, సుజిత్, నాగేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్న, రాజేష్ దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.
హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ - విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న చిత్ర పూజా కార్యక్రమాలు ఫిలింనగర్ దైవసన్నిధానంలో చేశాం. నాన్న క్లాప్ కొట్టారు. ఈనెలాఖరులో షూటింగ్ ప్రారంభిస్తున్నాం. రొమాంటిక్ థ్రిల్లర్ కథ ఇది. సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటుంది. మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. మలయాళంలో నేను నటించిన 1971, సూపర్ హిట్ దృశ్యం లాంటి చిత్రాలకు పని చేసిన సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. అలాగే మణిశర్మగారు సంగీతం అందిస్తున్నారు. మంచి టీం కుదిరింది. అన్ని వర్గాల్ని మెప్పించే కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. అని అన్నారు.
దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ - అల్లు శిరీష్ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురు పాటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఫిలినంగర్ దైవ సన్నిధానంలో జరిగాయి. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ గా సాగే సైంటిఫిక్ ఫిక్షన్ స్టోరీ. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.
సురభి మాట్లాడుతూ - మంచి కథలో భాగం అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జైటెడ్ గా ఉన్నాను. ఎనర్జిటిక్ టాలెంటెడ్ టీంతో వర్క్ చేస్తున్నాను. ఈసినిమా టీం అందరికి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.
సీరత్ కపూర్ మాట్లాడుతూ... విఐ ఆనంద్ తో ఇది నా రెండో చిత్రం. స్క్రిప్ట్ ఎంగేజింగ్ గా ఉంటుంది. అని అన్నారు.
శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ... కథ అద్భుతంగా వచ్చింది. నా క్యారెక్టరైజేషన్ చాలా బాగా ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎగ్జేటెడ్ గా ఉన్నాను. శిరీష్ తో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. సురభితో ఆల్రెడీ వర్క్ చేశాను. టీం అందరికి ఆల్ ది బెస్ట్. అని అన్నారు.
నటీనటులు - అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, సత్య, ప్రవీణ్, కాశీ విశ్వనాథ్, రోహిణి తదితరులు
కో ప్రొడ్యూసర్స్ - సతీష్ వేగేశ్న, రాజేష్ దండ సంగీతం - మణిశర్మ డిఓపి - సుజిత్ వాసుదేవ్ డైలాగ్స్ - అబ్బూరి రవి ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్ జి ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్ ఆర్ట్ - నాగేంద్ర ప్రసాద్ క్రియేటివ్ హెడ్ - సంపత్ కుమార్ కో డైరెక్టర్ - విజయ్ కామిశెట్టి బ్యానర్ - లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం.5 నిర్మాత - చక్రి చిగురు పాటి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - విఐ ఆనంద్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments