హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్న అల్లు శిరీష్!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా హీరో అల్లు శిరీష్ గురించి ఓ వార్త ఇండటస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి గాసిప్స్ ఇండస్ట్రీకేం కొత్త కాదు కానీ.. మెగా హీరో అవడంతో మరింత ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ హీరో గురించి ఇలాంటి రూమర్ రావడం ఇదే తొలిసారి. అతను మరెవరో కాదు.. అల్లు అర్జున్ సోదరుడు.. అల్లు శిరీష్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ హీరో.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని టాక్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’.. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అను ఇమ్మాన్యుయేల్ త్వరగానే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.
అల్లు శిరీష్ 2013లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కథ పరంగా అద్భుతమైన, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకుంటూ వెళుతున్నాడు కానీ ఎందుకో సక్సెస్ మాత్రం కాలేకపోతున్నాడు. అయినప్పటికీ అల్లు అరవింద్ తనయుడిగా.. అల్లు అర్జున్ సోదరుడిగా శిరీష్‌కు బాగానే క్రేజ్ ఉంది. అయితే ఈ యంగ్ హీరోకు, అను ఇమ్మాన్యుయేల్‌కి మధ్య కొంతకాలంగా ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జోరుగానే సాగుతోంది. తాజాగా అల్లు శిరీష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కూడా దీనికి బలాన్ని చేకూర్చేదిగానే ఉంది. ప్రచారం జరుగుతుంది. రెండు రోజుల క్రితం మార్చి28న నటి అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. లేట్‌గా విషెస్ చెబుతున్నానని తనకు తెలుసని.. కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యిందని శిరీష్ వీడియోలో పేర్కొన్నాడు. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ శిరీష్ శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో శిరీష్, అనులు ప్రేమలో ఉన్నారనే కాకుండా.. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కూడా సమాచారం. ఇక ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఇంక మరెన్ని పుకార్లు చెలరేగుతాయో వేచి చూడాలి. ఇప్పటి వరకూ ఈ పుకార్ల విషయమై అటు శిరీష్ కానీ.. ఇటు అను కానీ స్పందించలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments