క్షమించండి.. ఫ్యాన్స్‌కు అల్లు శిరీష్ భావోద్వేగ లేఖ
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు కుటుంబం నుంచి అబ్బాయి అల్లు శిరీష్.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు చేయని ప్రయత్నాల్లేవ్. ఇప్పటికే పలు సినిమాలు చేసిన అల్లువారబ్బాయి.. పెద్దగా ఏమీ వర్కవుట్ అవ్వలేదు. అయితే తాజాగా ‘ABCD’ చిత్రంలో నటించిన ఆయన మెగా అభిమానులు, సినీ ప్రియులను మెప్పించలేకపోయారు.
ఈ సినిమాతో అయినా తనకు మంచి పేరు వస్తుందని.. భావించిన అల్లు శిరీష్ అది కాస్త మళ్లీ రివర్స్ అయ్యింది. ‘గౌరవం’ నుంచి నేటి ‘ABCD’ వరకు భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడం.. మరోవైపు తన సొంత అన్న.. అటు మెగా ఫ్యామిలీలోని హీరోస్ అందరూ ముందుకు దూసుకెళ్తుండటంతో శిరీష్‌కు ఏం చేయాలో తోచని పరిస్థితి.
అభిమానులారా క్షమించండి!
కాగా.. నేడు అనగా మే 30న శిరీష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ABCD సినిమా ఫలితంపై ఫస్ట్ టైమ్ పెదవి విప్పారు. "ABCD సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ ఈ సినిమా అనుకున్న ఫలితాన్నివ్వలేదు. అభిమానులారా ఇందుకు గాను నన్ను క్షమించండి. ABCD కోసం దర్శకుడు సంజీవ్ రెడ్డితో పాటు నిర్మాత యష్ రంగినేని కూడా చాలా కష్టపడ్డారు.
కానీ మేం ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును.. వాళ్ల సలహాలను కచ్చితంగా పాటిస్తాను. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలను చేయడానికి నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన స్నేహితులకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు" అని అల్లు శిరీష్ భావోద్వేగంతో అభిమానులకు లేఖ రాశారు.
కాగా.. ఇప్పటికే తాను నటించిన ‘వీవీఆర్’ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ బహిరంగ రాసి క్షమాపణలు కోరిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చెర్రీ తర్వాత అల్లుశిరీష్ ఇలా నిజాయితీగా ఒప్పుకున్నాడని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
❤️???? pic.twitter.com/kSUyKPNQbM
— Allu Sirish (@AlluSirish) May 30, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments