క్షమించండి.. ఫ్యాన్స్‌కు అల్లు శిరీష్ భావోద్వేగ లేఖ

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

అల్లు కుటుంబం నుంచి అబ్బాయి అల్లు శిరీష్.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు చేయని ప్రయత్నాల్లేవ్. ఇప్పటికే పలు సినిమాలు చేసిన అల్లువారబ్బాయి.. పెద్దగా ఏమీ వర్కవుట్ అవ్వలేదు. అయితే తాజాగా ‘ABCD’ చిత్రంలో నటించిన ఆయన మెగా అభిమానులు, సినీ ప్రియులను మెప్పించలేకపోయారు.

ఈ సినిమాతో అయినా తనకు మంచి పేరు వస్తుందని.. భావించిన అల్లు శిరీష్ అది కాస్త మళ్లీ రివర్స్ అయ్యింది. ‘గౌర‌వం’ నుంచి నేటి ‘ABCD’ వ‌ర‌కు భిన్నమైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడం.. మరోవైపు తన సొంత అన్న.. అటు మెగా ఫ్యామిలీలోని హీరోస్ అందరూ ముందుకు దూసుకెళ్తుండటంతో శిరీష్‌కు ఏం చేయాలో తోచని పరిస్థితి.

అభిమానులారా క్షమించండి!

కాగా.. నేడు అనగా మే 30న శిరీష్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ABCD సినిమా ఫ‌లితంపై ఫస్ట్ టైమ్ పెదవి విప్పారు. ABCD సినిమా కోసం చాలా క‌ష్టప‌డ్డాం.. కానీ ఈ సినిమా అనుకున్న ఫ‌లితాన్నివ్వలేదు. అభిమానులారా ఇందుకు గాను న‌న్ను క్షమించండి. ABCD కోసం దర్శకుడు సంజీవ్ రెడ్డితో పాటు నిర్మాత య‌ష్ రంగినేని కూడా చాలా క‌ష్టప‌డ్డారు.

కానీ మేం ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. అయితే ప్రజ‌లు ఇచ్చిన తీర్పును.. వాళ్ల స‌ల‌హాల‌ను కచ్చితంగా పాటిస్తాను. భవిష్యత్తులో మ‌రిన్ని మంచి సినిమాల‌ను చేయ‌డానికి నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన స్నేహితులకు, మీడియా మిత్రులకు ధ‌న్యవాదాలు అని అల్లు శిరీష్ భావోద్వేగంతో అభిమానులకు లేఖ రాశారు.

కాగా.. ఇప్పటికే తాను నటించిన ‘వీవీఆర్’ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో సోషల్ మీడియా వేదికగా మెగా పవర్ స్టార్‌ రామ్‌చరణ్ బహిరంగ రాసి క్షమాపణలు కోరిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చెర్రీ తర్వాత అల్లుశిరీష్ ఇలా నిజాయితీగా ఒప్పుకున్నాడని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

More News

పాలన పై జగన్ పట్టు.. చంద్రబాబు టీమ్ ఔట్

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై పట్టుబిగించేందుకు చర్యలు షురూ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల్లోనే జగన్

ప్రమాణానికి ముందు జగన్‌కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరిగాంధీ స్టేడియం వేదికగా..

కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన 42 మంది నేతలు వీరే..

భారతీయ జనతాపార్టీ ఎవరు సపోర్టు లేకుండా స్వతంత్రంగా పోటీచేసి ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం మోదీ మానియా.. షా చరిష్మా మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జగన్, కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు నో పర్మిషన్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.

భావోద్వేగంతో ప్రసంగం.. పెన్షన్‌పై జగన్ తొలి సంతకం.. మీడియాకు వార్నింగ్!

అవినీతి రహిత పాలన అందించేందుకు పాలనలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తానని.. ప్రజలందరి ముఖాల్లో సంతోషం నింపడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.