బన్నీతో పోల్చుకున్న అల్లు శిరీష్.. అదే పనిలో ఉన్నాడట!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ మేనల్లుడిగా, అల్లు రామలింగయ్య మనవడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు టాప్ స్టార్. డాన్స్, నటన, ఫైట్స్ లో అల్లు అర్జున్ అభిమానులని అలరిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక అన్న అడుగుజాడల్లో నడిచేందుకు అల్లు శిరీష్ కూడా హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఇంతవరకు శిరీష్ కు సాలిడ్ హిట్ అయితే పడలేదు. ప్రస్తుతం శిరీష్ హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తదుపరి చిత్రాలు కథలకు అనుగుణంగా మేకోవర్ మార్చుకునేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు.
ఇటీవల శిరీష్ సిక్స్ ప్యాక్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తన సిక్స్ ప్యాక్ బాడీ తో శిరీష్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇదిలా ఉండగా తాజాగా శిరీష్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో తనని అల్లు అర్జున్ తో పోల్చుకున్నాడు.
దేశముదురు చిత్రంలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించిన విషయం గుర్తుందిగా. బన్నీ సిక్స్ ప్యాక్ ని, తన సిక్స్ ప్యాక్ ని పోల్చుకుంటూ ఫోటో షేర్ చేశాడు. అల్లు అర్జున్ కే మంచి సిక్స్ ప్యాక్ లుక్ ఉందని, తాను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నానని శిరీష్ కామెంట్ చేశాడు.
ప్రస్తుతం శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా ప్రేమ కాదంట అనే చిత్రంలో నటిస్తున్నాడు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ రొమాన్స్ లో మునిగి తేలుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రాకేష్ శశి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి తాను డబ్బింగ్ కూడా మొదలు పెట్టినట్లు శిరీష్ తెలిపాడు. ఇక కేవలం చివరి షెడ్యూల్ షూట్ మాత్రమే మిగిలి ఉందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com