కొత్త లెక్కలు చెబుతున్న అల్లు శిరీష్..!
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్ హీరోగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు. ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణతో మూడవ వారంలోను విజయవంతంగా ప్రదర్శితమౌతుంది. గతంలో సినిమా రేంజ్ గురించి చెప్పాలంటే...మా సినిమా ఇన్నిసెంటర్స్ లో 50 రోజులు, 100 రోజులు ఆడిందని గొప్పగా చెప్పేవారు. ప్రజెంట్...మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంటూ కలెక్షన్స్ చెబుతున్నారు.
అయితే...అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు చిత్రాన్ని ఇప్పటి వరకు 32 లక్షలు మంది చూసారు అంటూ కొత్త లెక్కలు చెబుతున్నారు. రెండోవారం కంటే మూడవ వారంలో కలెక్షన్స్ బాగున్నాయి. జనరల్ గా రోజురోజుకి కలెక్షన్స్ తగ్గిపోతుంటాయి కానీ..మా సినిమా రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. గత పది రోజులుగా ఏ పెద్ద సినిమా రిలీజ్ కాలేదు. అందుచేత బాక్సా ఫీస్ వద్ద శ్రీరస్తు శుభమస్తు కలెక్షన్స్ ఇంకొన్ని రోజులు స్టడీగా ఉంటాయి అంటున్నారు. ఇప్పటి వరకు సినిమా రేంజ్ చెప్పాలంటే... సెంటర్స్, కలెక్షన్స్ చెప్పే సినీజనం భవిష్యత్ లో మా సినిమాని ఇంత మంది చూసారు అంటూ ఆడియోన్స్ లెక్కలు చెబుతారేమో..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com